AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: కలకలం రేపుతున్న మొసలి సంచారం.. భయంతో వణికిపోతున్న జనం..

వేదావతి నదిలో నుంచి నిత్యం జనాలు రాకపోకలు సాగించేవారు. కానీ సడన్‌గా ఇప్పుడు ఆ నది నుంచి వెళ్దామంటేనే జనం భయంతో వణుకుతున్నారు. ఎంత అర్జుంట్‌ పని ఉన్నా సరే.. నడక దారినే వెళ్తున్నారు. కానీ..

Kurnool: కలకలం రేపుతున్న మొసలి సంచారం.. భయంతో వణికిపోతున్న జనం..
Crocodile In Vedavati River
Ganesh Mudavath
|

Updated on: Nov 27, 2022 | 6:58 AM

Share

వేదావతి నదిలో నుంచి నిత్యం జనాలు రాకపోకలు సాగించేవారు. కానీ సడన్‌గా ఇప్పుడు ఆ నది నుంచి వెళ్దామంటేనే జనం భయంతో వణుకుతున్నారు. ఎంత అర్జుంట్‌ పని ఉన్నా సరే.. నడక దారినే వెళ్తున్నారు. కానీ.. ఆ నీళ్లలో నుంచి వెళ్లడం లేదు..? కారణం ఏంటో తెలిస్తే.. మీరూ భయపడాల్సిందే.. నీటిలో ఉన్నప్పుడు మొసలి చిన్నదే అయినప్పటికీ, చాలా పెద్దదైన ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపేయగల కెపాసిటీ దాని సొంతం. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటిని వదలి బయటికి వచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్ గా ఉండదు. అలాంటి పరిస్థితి వేదావతి నదిలో ఉన్న మొసలికి ఉండటంతో ప్రజలు చాలా భయపడుతున్నారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడి సమీపంలోని నదిలో మొసలి ఉండటంతో వణికిపోతున్నారు. ఈ మొసలి వేదావతి నది ఒడ్డున గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. అటు ఇటు సంచరించుకుంటూ అటు నుంచి వెళ్లే వారికి నిద్రలేకుండా చేస్తోంది.

ఆంధ్రా – కర్నాటక బార్డర్ అయిన వేదావతి నది ఒడ్డున మొసలి ఉండటంతో నది తీర గ్రామ ప్రజలు, రైతులు సైతం భయపడుతున్నారు. రెండు రోజులుగా నది పరిసరాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నది ఒడ్డున సంచరిస్తున్న మొసలి వీడియోలను యువకులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తుండటంతో మరింతగా ప్రజలు భయపడుతున్నారు. అలాగే మార్లమడికి నుంచి కర్నాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్లే ప్రజలు కూడా వెళ్లడం లేదు. ఈ నదిగుండ తెప్పల్లో వెళ్తున్న ప్రజలు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారు.

నది తీరాన సంచిరిస్తున్న మొసలిని సంబంధిత అధికారులు పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ మొసలి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఒడ్డున కనిపించడంతో అధికారులకు సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరేమో తప్పనిసరి పరిస్థితుల్లో మొసలికి భయపడుతూ తెప్పల్లో ప్రయాణం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..