AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పొట్టేళ్లు పోతున్నాయని పీఎస్‌కు రైతులు.. పోలీసులు రియాక్షన్ ఏంటో తెలుసా?

ఇన్నాళ్లు గ్రామాల్లోని పొలాల వద్ద ఉండే ఆవులు, ఎద్దులు, బర్రెల వంటి వాటిని ఎత్తుకెళ్లే కొందరు కేటుగాళ్లు ఇప్పుడు పొట్టేళ్లపై పడ్డారు. రాత్రి వేళల్లో గ్రామాల్లోకి చొరబడి.. గుట్టుచప్పుడు కాకుండా అందినకాగికి పొట్టేళ్లను ఎత్తుకెళ్లి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.తాగాజా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వెలుగు చూసింది. గ్రామంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో గొర్రెల పెంపకం దారులు హడలి పోతున్నారు.

Andhra News: పొట్టేళ్లు పోతున్నాయని పీఎస్‌కు రైతులు.. పోలీసులు రియాక్షన్ ఏంటో తెలుసా?
Andha News
Raju M P R
| Edited By: Anand T|

Updated on: Nov 07, 2025 | 5:12 PM

Share

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు లో పొట్టేళ్లు మాయమవుతున్నాయి. రాత్రికి రాత్రే పొట్టేళ్లను మాయం చేస్తున్న దొంగలు వాటిని అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. ఇలా గ్రామాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న గొర్రెల పెంపకం దారులు పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టారు. గంగాధర నెల్లూరు, ఎస్ఆర్ పురం, పెనుమూరు పోలీస్ స్టేషన్‌లలో భారీగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయినా కూడా ఆ ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలు మాత్రం ఆగట్లేదు. వరుసగా పొట్టేలు మాయమవుతూనే ఉన్నాయి.

పొట్టేళ్ల దొంగతనాలను పోలీసులు సీరియస్‌గా పరిగణించక పోవడంతో నేరుగా భాదితులే రంగంలోకి దిగారు. వాటి ఆచూకీ కనుగొనే ప్రయత్నం మొదటుపెట్టారు. పొట్టేళ్ల దొంగలను పట్టుకునే ప్రయత్నంలో బాధితులు వారపు సంతలు జరిగే ప్రాంతాల్లో గాలించారు. అయితే సంతల్లో బాధితులు కొన్నిచోట్ల తమ పొట్టేళ్లను కనిపించాయి. దీంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు మాత్రం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

సమాచారం ఇచ్చినా పట్టించు కోక పోగా.. పొట్టేళ్ల దొంగతనంపై అవహేళనగా మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తమను తీవ్ర ఆవేదనకు గురిచేసందని బాధితులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.