Andhrapradesh: అక్కడ జోరుగా మద్యం అక్రమ రవాణా.. పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు..

రాష్ట్రంలో మద్యం ధరలతో పోలిస్తే పక్క రాష్ట్రాల్లో కొద్దిగా తక్కువుగా ఉండటంతో.. అధిక ఆదాయం సంపాదించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. పోలీసులు తనిఖీలు చేస్తున్నా వారి కళ్లుగప్పి మరీ మద్యాన్ని సరిహద్దులు దాటిచేస్తున్నారు.

Andhrapradesh: అక్కడ జోరుగా మద్యం అక్రమ రవాణా.. పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు..
Police
Follow us

|

Updated on: Aug 12, 2022 | 8:36 AM

Andhrapradesh: రాష్ట్రంలో మద్యం ధరలతో పోలిస్తే పక్క రాష్ట్రాల్లో కొద్దిగా తక్కువుగా ఉండటంతో.. అధిక ఆదాయం సంపాదించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు కొందరు ప్రబుద్దులు. పోలీసులు తనిఖీలు చేస్తున్నా వారి కళ్లుగప్పి మరీ మద్యాన్ని సరిహద్దులు దాటిచేస్తున్నారు. అయితే కర్ణాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు, కర్నూలులో పోలీసులు పక్కా స్కెచ్ తో అంతరాష్ట్ర మద్యం స్మగ్లర్ల ఆటకట్టించారు. చిత్తూరులోని జింకల పార్కు వద్ద అనుమానస్పదంగా ఉన్న వాహనాలను పోలీసులు గుర్తించి తనఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న మూడు వాహనాల్లో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను గుర్తించారు. రూ.9 లక్షలు విలువచేసే లిక్కర్ తో పాటు, రూ. 16లక్షలు విలువైన మూడు కార్లను, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అంతర్రాష్ట్ర మద్యం స్మగ్లర్లను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు మాజీ హోం గార్డ్ కుమరేషన్ కాగా.. మరో ముగ్గురు ఐరాలకు చెందిన మధుసూదన్ రెడ్డి, కర్ణాటక కేజిఎఫ్ కు చెందిన మురళి, చిత్తూరుకు చెందిన రమేష్ లు గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.

మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలో అక్రమం మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న వాహనాలను మాధవరం చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనీఖీ చేసి పట్టుకున్నారు. కారులో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి.. నిందితుడి నుంచి 20 బాక్స్ ల మద్యం, సెల్ ఫోన్, కారును స్వాదీనం చేసుకున్నారు. పట్టుపడ్డ మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..