Andhra Pradesh: దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. హుండీ డబ్బులు కాజేసిన ఆలయ సెక్యూరిటీ అధికారి
కంచే చేను మేయడం.. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం లాంటి సామెతలు వినడమే గాని చూసింది చాలా అరుదు. కానీ అచ్చం అలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హుండీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరే నగదు చోరీకి పాల్పడిన సంఘటన ఆలయ అధికారులను ఆశ్చర్యపరచింది. సెక్యూరిటీ అధికారి కృష్ణారెడ్డి హుండీలో డబ్బులు చోరీ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి తెల్లవారుజామున అభిషేకం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించారు.
కంచే చేను మేయడం.. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం లాంటి సామెతలు వినడమే గాని చూసింది చాలా అరుదు. కానీ అచ్చం అలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హుండీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరే నగదు చోరీకి పాల్పడిన సంఘటన ఆలయ అధికారులను ఆశ్చర్యపరచింది. సెక్యూరిటీ అధికారి కృష్ణారెడ్డి హుండీలో డబ్బులు చోరీ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దేవస్థానంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణారెడ్డి తెల్లవారుజామున అభిషేకం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత ఆలయంలోని హుండీలో ఎనిమిది సార్లు డబ్బులు దొంగతనానికి పాల్పడ్డాడు. చోరీ విషయం తెలుకున్న ఆలయ అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. తెల్లవారుజామున నమోదైన సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు.
సెక్యూరిటీ ఆఫీసర్ కృష్ణారెడ్డి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పలుమార్లు హుండీలో చేయి పెట్టి డబ్బులు చోరీ చేసి డబ్బును తన ప్యాంటు జేబులో పెట్టుకుంటున్న దృశ్యాలు మొత్తం రికార్డు అయ్యాయి. వెంటనే అతడిని విధుల నుంచి తొలగించిన ఆలయ అధికారులు కసాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను పరిశీలించగా… సులభంగా హుండీలో చేయి పెట్టి డబ్బులు దొంగిలించే విధంగా హుండీలు తయారు చేయడంపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రావణమాసం పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి హనుమాన్ దర్శనం కోసం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆంజనేయుడిపై విశ్వాసంతో, నమ్మకంగా భక్తులు హుండీలలో చెల్లించుకున్న ముడుపులు ఇలా చోరీకి కావడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అయితే హుండీలు ఈ విధంగా సులభంగా డబ్బులు చోరీ చేసే విధంగా ఉండడంతోనే చోరీ జరిగినట్టు ఈ ఘటనతో స్పష్టంగా వెల్లడవుతోంది. దీంతో ఈ విషయం ఎంతకాలం నుంచి జరుగుతోంది.. ఇంకా ఎంతమంది ఇంటి దొంగల ప్రమేయం ఉంది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




