Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రతి కుటుంబానికి రూ.2వేలు.. వరద ప్రభావిత జిల్లాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్..

CM Jagan: వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.

Andhra Pradesh: ప్రతి కుటుంబానికి రూ.2వేలు.. వరద ప్రభావిత జిల్లాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్..
Cm Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 15, 2022 | 7:19 PM

గోదావరి వరదలు(Godavari Floods), సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా సమావేశమయ్యారు. ఏరియల్‌ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌. వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం సమగ్ర సమీక్ష చేశారు.

ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం జగన్. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు.

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించేలా చూడాలని సీఎస్‌ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సీఎం ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు సీఎం. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇవి కూడా చదవండి

శనివారం కూడా గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందనే సమాచారం వస్తోందన్నారు. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావం ఉన్న గ్రామాలన్నింటినీ ఖాళీచేయాలని.. గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సమాగ్రిని సిద్ధంచేసుకోవాలని అన్నారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని.. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని.. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు 

48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలా ప్లాన్ చేయాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల ఇవ్వాలని.. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని.. ఏదైనా అత్యవసర సర్వీసుల కోసం వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు.  పరిస్థితిని సమీక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించుకోవాలని అన్నారు.

గ్రామాల్లో పారిశుధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం సూచించారు. వరదలో కొట్టుకొస్తున్న పాములతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పాము కాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలని.. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెల్‌టవర్లకు డీజిల్ సరఫరాచేసి అవి నిరంతరం పనిచేసేలా చూడండన్నారు.

వరద బాధితులకు సీనియర్‌ అధికారులు..

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వంచిన అనంతరం వరద బాధిత జిల్లాలకు ఐదుగురు సీనియర్‌ అధికారుల నియామించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

ఏపీ వార్తల కోసం..