AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే..ఎవరు బరిలోకి వస్తున్నారంటే

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కీలకంగా మారనుంది. 2019 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది.

Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే..ఎవరు బరిలోకి వస్తున్నారంటే
Ysrcp Flag
Aravind B
|

Updated on: Mar 31, 2023 | 7:37 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కీలకంగా మారనుంది. 2019 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్తులు మారే అవకాశం కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చంద్రగిరి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేయనని ప్రకటించారు. ఆయన స్థానంలో పోటిచేయడానికి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ ని కోరారు.

చెవిరెడ్డి భాస్కర రెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు మద్దతుగా నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని నామినేటెడ్ పదవుల నుంచి తొలిగించినా..చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాత్రం తుడా ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే పార్టీలో వారసులకు టికెట్ల కేటాయింపుపై భారీ లిస్టు సీఎం జగన్ వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో..వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలకు మినహాయించి వారసుల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి