Chandrababu Arrest: ఇవాళ ఇదే జరగనుంది..! చంద్రబాబు పిటిషన్లపై సుప్రీం, ఏసీబీ, హైకోర్టుల్లో కీలక విచారణ..
Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిటీషన్లపై ఇవాళ కీలక విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ అమరావతి ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరగనుంది. అంతేకాకుండా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై, హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్ వ్యవహారంలో ముందస్తు బెయిల్‌పై విచారణ జరగనుంది.
Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిటీషన్లపై ఇవాళ కీలక విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ అమరావతి ఏసీబీ కోర్టులో కీలక విచారణ జరగనుంది. అంతేకాకుండా.. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై, హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్ వ్యవహారంలో ముందస్తు బెయిల్‌పై విచారణ జరగనుంది. అయితే, సీఐడి దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. చంద్రబాబు కస్టడీ నివేదికను ఇప్పటికే సీల్డ్ కవర్లో కోర్టుకు అందచేసిన సీఐడీ అధికారులు.. మరో ఐదు రోజులు పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటీషన్లపై చంద్రబాబు తరుపు న్యాయవాదులు, సీఐడీ తరుపు న్యాయవాదుల వాదనల అనంతరం ఇవాళ ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వనుంది. అంతేకాకుండా.. హైకోర్టులో ఇన్నర్ రింగ్‌రోడ్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరగనుంది. హైకోర్టులో ఇన్నర్‌రింగ్‌రోడ్ ముందస్తు బెయిల్‌పై మధ్యాహ్నం 2:15కి వాదనలు ప్రారంభం కానున్నాయి.
ఉపశమనం లభిస్తుందా..?
అయితే, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై (స్పెషల్ లీవ్ పిటిషన్) ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. చంద్రబాబుకు ఇవాళ ఉపశమనం లభించకపోతే.. అక్టోబర్ 3 వరకు జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి అక్టోబర్ 2వరకు కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానంతోపాటు.. ఏసీబీ, హైకోర్టులలో కీలక వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తీర్పు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
నిన్న ఏసీబీ కోర్టులో మూడు గంటల పాటు వాదనలు సాగాయి.. కోర్ట్ సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇవాల్టికి వాయిదా వేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసులంటూ వాదించిన బాబు తరుపు న్యాయవాది లూథ్రా.. క్విడ్ ప్రోకో జరగలేదని, ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వనపుడూ అవినీతి ఎలా జరుగుతుందంటూ న్యాయస్థానానికి తెలిపారు. కుటుంబానికి లబ్ది చేకూర్చేలా అలైన్‌మెంట్‌లో మార్పులు చేసారంటూ ఏజీ పొన్నవోలు సీఐడీ తరుపున వాదించారు. లోయర్ కోర్టులో కస్టడీ పిటిషన్ ఉండగా బెయిల్ పిటిషన్ ఎలా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. అంగళ్ళు కేసులో వాదనలు ముగిశాయి. ముందస్తు బెయిల్‌పై న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
కోర్ట్ ధిక్కరణ పిటిషన్‌పై నేడు విచారణ..
చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల వ్యవహారంపై ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్‌లో వెల్లడించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని.. గడచిన రెండు వారాల పరిణామాలను వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుల గౌరవానికి భంగం కలిగించారని.. న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారని.. న్యాయ వ్యవస్థకున్న విలువలను ధ్వంసంచేసేలా వ్యవహరించారంటూ పిటిషన్లో వివరించారు.
రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..
చంద్రబాబు అరెస్టుపై నారా లోకేశ్ టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్. జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించానన్నారు నారా లోకేశ్. వైసీపీకి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానంటూ పేర్కొన్నారు. అనంతరం జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు, ఢిల్లీ నుంచి వర్చువల్‌గా లోకేష్ హాజరయ్యారు. టీడీపీ కార్యక్రమాల పర్యవేక్షణకు 14 మందితో కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో నిలిచిపోయిన యువగళం పాదయాత్రను కూడా ప్రారంభించనున్నారు. 29 రాత్రి 8.15 కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..