Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన.. ప్రైవేటీకరణకు ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా.?
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం శుభవార్త చెప్పనుందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియకు ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పడిందా? జీవీఎల్ కామెంట్లకు అర్థం అదేనా? ఇంతకీ అసలు విషయం ఏంటి.? ఆయన మాటల వెనుక మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..? ఈ స్టోరీ మీకోసమే..
విశాఖపట్నం, సెప్టెంబర్ 27: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం శుభవార్త చెప్పనుందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియకు ప్రస్తుతానికి ఫుల్‌స్టాప్ పడిందా? జీవీఎల్ కామెంట్లకు అర్థం అదేనా? ఇంతకీ అసలు విషయం ఏంటి.? ఆయన మాటల వెనుక మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..? ఈ స్టోరీ మీకోసమే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక కామెంట్లు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడప్పుడే జరగదన్నారు ఆయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రస్తుతానికి ఆగిందన్నారు. గత ప్రభుత్వాల విధానాలు, యాజమాన్యం వైఫల్యం వల్లే స్టీల్ ప్లాంట్‌కి ఈ దుస్థితి వచ్చిందన్నారు బీజేపీ ఎంపీ. RINLని అభివృద్ధి చేసి లాభాల బాటలో పయనించేలా గట్టి ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. సంస్థలో ఇబ్బందులు అధిగమించేలా ప్రయత్నిస్తామని జీవీఎల్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ రంగంలోనే సంస్థ నిర్వహణ ఉండేందుకు తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు జీవీఎల్. అదే ప్రస్తుతానికి తమ కార్యాచరణ అని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన గనుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ ఆగిపోయింది అని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు జీవీఎల్. స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో 20 ప్రశ్నలు లేవనెత్తి హామీలు తీసుకున్నామని, ఇందులో కనీసం మూడోవంతు ప్రశ్నలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు వేయలేదంటూ విమర్శించారు జీవీఎల్. కాగా, జీవీఎల్ కామెంట్లతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ఆగినట్లే అని కార్మికులతో పాటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..