TDP: టీడీపీ నయా ప్లాన్.. పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు.!
అధినాయకుడు జైల్లో ఉండడంతో టీడీపీ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. జనసేన నేతలతో కలిసి JAC ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కమిటీ పేర్కొంది.
అధినాయకుడు జైల్లో ఉండడంతో టీడీపీ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. జనసేన నేతలతో కలిసి JAC ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని కమిటీ పేర్కొంది.
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండడంతో…రాజకీయ కార్యాచరణను సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించేందుకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం 14 మందితో ఈ కమిటీ ఏర్పాటయింది. సమావేశానికి…ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఇతర సభ్యులు హాజరయ్యారు. నారా లోకేష్..ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిశాక అచ్చెన్నాయడు మీడియాతో మాట్లాడారు. ఏపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయిలో పోరాడేందుకు టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్ర స్థాయిలో JAC ఏర్పాటు చేస్తామని, దీనిపై జనసేనతో కో-ఆర్డినేట్ చేసుకుంటామన్నారు అచ్చెన్న. ఈ నెల 29న రాత్రి 8:15కి…లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పాదయాత్ర ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచే తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేసినా ప్రభుత్వం వైపు నుంచి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు అచ్చెన్న.
ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాడతామన్నారు. లోకేష్‌కు సంబంధం లేని విషయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటూ కేసు నమోదు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ లేదని.. భూ సేకరణ కూడా జరగలేదన్నారు ఆయన. కానీ ఏదో జరిగిందనే భ్రమలు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు అచ్చెన్న. మీరేం తప్పు చేశారు.. ఏం ఆధారాలున్నాయో చెప్పండంటూ కేసులు పెట్టిన వారే చంద్రబాబును అడుగుతున్నారన్నారు టీడీపీ నేత. తమపై కేసులు పెట్టి, ఓటర్ల జాబితాలో వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అన్ని స్థాయిల్లో ఓటర్ జాబితా వెరిఫికేషన్ చేపడతామన్నారు టీడీపీ నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..