నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఇన్నర్ రింగ్‌రోడ్ అవకతవకలపై మాట్లాడనున్న సీఎం జగన్!
AP Assembly Session 2023: అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఐఆర్‌ఆర్ అక్రమాలను సభలో సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. ఐఆర్‌ఆర్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ14గా లోకేష్ ఉన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ సమావేశంలో రెండు బిల్లులకు వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లుకు, ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ సమావేశాల్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006 ను సవరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా అసెంబ్లీలో అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ అవకతవకలపై చర్చ జరగనుంది. వైద్యారోగ్య శాఖలో సంస్కరణలపై, ఆలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ కూడా చేపట్టనుంది.
అయితే, అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఐఆర్‌ఆర్ అక్రమాలను సభలో సీఎం జగన్ వివరించే అవకాశం ఉంది. ఐఆర్‌ఆర్ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ14గా లోకేష్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు పూర్తయిన నేపథ్యంలో.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..