కర్నూలులో అత్యంత వైభవంగా ఆనంద ఉత్సవాల మధ్య వినాయక నిమజ్జనం..

మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచే కర్నూలులో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత ప్రశాంతంగా వైభవోపేతంగా జరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా మతసామరస్యానికి ప్రతీకగా కర్నూలులో జరుగుతున్న వినాయక నిమజ్జనానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అంతస్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు జరిగేది కర్నూలులోనే. వాస్తవంగా హైదరాబాద్ తర్వాత ముస్లిం జనాభా అత్యధికంగా ఉండేది కర్నూలు జిల్లాలోనే. అలాంటి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు జరగడం విశేషంగా చెప్పుకుంటారు.

కర్నూలులో అత్యంత వైభవంగా ఆనంద ఉత్సవాల మధ్య వినాయక నిమజ్జనం..
Ganesh Immersion
Follow us
J Y Nagi Reddy

| Edited By: Aravind B

Updated on: Sep 26, 2023 | 10:13 PM

మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచే కర్నూలులో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత ప్రశాంతంగా వైభవోపేతంగా జరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా మతసామరస్యానికి ప్రతీకగా కర్నూలులో జరుగుతున్న వినాయక నిమజ్జనానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అంతస్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు జరిగేది కర్నూలులోనే. వాస్తవంగా హైదరాబాద్ తర్వాత ముస్లిం జనాభా అత్యధికంగా ఉండేది కర్నూలు జిల్లాలోనే. అలాంటి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు జరగడం విశేషంగా చెప్పుకుంటారు. తొమ్మిది రోజులపాటు గణనాథులు పూజలందుకొని నేడు నిమజ్జనం అవుతున్నారు. అలాగే నగరంలోని అన్ని కాలనీలలో ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహాలు ఈ మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా బయలుదేరి ప్రధాన వీధుల గుండా కేసీ కెనాల్‎కు చేరుకొని అక్కడ నిమజ్జనం అవుతాయి. ఇప్పటికే పెద్ద పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామున నిమజ్జనం జరగనుంది.

నిమజ్జనం దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా ఎదుర్కొనేందుకు ప్రశాంత నిమజ్జనం కోసం 150 మందికి పైగా గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు.2 వేల మందికి పైగా పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మళ్లించారు. నగర శివారులలోనే కార్లు బస్సులు మళ్లిస్తున్నారు. మొట్టమొదట ప్రత్యేక పూజలు చేసి రాంబట్ల దేవాలయం దగ్గర ఉన్న వినాయక విగ్రహాన్ని తరలించడంతో శోభాయాత్ర మొదలవుతుంది. పిల్లలు వృద్దులు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా మొత్తం నగర జనాభా అంతా రోడ్లమీదకి వచ్చి వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వాస్తవంగా వినాయక నిమజ్జనం చేసేందుకు కేసీ కెనాల్ లో నీరు లేదు. అయినా కూడా ప్రత్యేకంగా సుంకేసుల రిజర్వాయర్ నుంచి నిమజ్జనం కోసమే నీటిని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ సృజన నగరం అంతటా తిరిగి ఏర్పాట్లు పరిశీలించి ప్రశాంత నిమజ్జనం కోసం ప్రయత్నిస్తున్నారు.

జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ స్వయంగా బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. నగర ప్రముఖులు ఎమ్మెల్యేలు అధికారులు నిమజ్జన ఉత్సవాలలో పాలుపంచుకుంటున్నారు. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగము రెవెన్యూ యంత్రాంగము కర్నూల్ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు నగరవాసులను అప్రమత్తం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగరంలోని కేసీ కెనాల్‎లో భారీ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు పెద్ద పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 2200 విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మొత్తం పది నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేశారు. 1980లో కేవలం రెండు విగ్రహాలతో మొదలైన కర్నూలు వినాయక ఉత్సవాలు నేడు 2200 విగ్రహాలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అంత భారీ స్థాయిలో వినాయక ఉత్సవాలు జరిగేది కర్నూలులోనే. ఈ రాత్రంతా నిమజ్జన కార్యక్రమం విద్యుత్ కాంతుల మధ్య వైభవంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి