Chandrababu Naidu arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్..

ఏపీ స్కిల్‌ స్కామ్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ కూడా బుధవారానికి వాయిదా పడింది. మరోవైపు నారా లోకేశ్‌ టీడీపీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వైసీపీకి తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు లోకేశ్‌.

Chandrababu Naidu arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై జోక్యం చేసుకోండి.. రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్..
Nara Lokesh Urged President
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2023 | 9:53 PM

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. అంగళ్లు ఘటనలో బెయిల్‌ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ కూడా వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం రెండుంబావుకు వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేరును సీఐడీ చేర్చింది. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. అటు చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగనుంది.

మరోవైపు నారా లోకేశ్‌ టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్‌. జగన్‌ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించానన్నారు నారా లోకేశ్‌. అనంతరం జరిగిన టీడీపీ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడు, ఢిల్లీ నుంచి వర్చువల్‌గా లోకేష్‌ హాజరయ్యారు. టీడీపీ కార్యక్రమాల పర్యవేక్షణకు 14 మందితో కమిటీ ఏర్పాటు చేశారు.

ఇదిలావుంటే, స్కిల్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండడంతో…రాజకీయ కార్యాచరణను సమన్వయం చేసి పార్టీని ముందుకు నడిపించేందుకు టీడీపీ పొలిటికల్‌ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం 14మందితో ఈ కమిటీ ఏర్పాటయింది. సమావేశానికి…ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, ఇతర సభ్యులు హాజరయ్యారు. నారా లోకేష్‌..ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..