Chandrababu: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతి.. బ్లాక్, ఖైదీ నెంబర్ ఏంటంటే..?

45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటిసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. శనివారం ఉదయం ఆయన్ను అరెస్ట్‌ చేయగా, ఆదివారం సాయంత్రం ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే రాత్రి జైలులోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు ఏం చేశారు..? బాబుకు ఏ గది కేటాయించారు...? ఖైదీ నెంబర్‌ ఏంటి..? చంద్రబాబు కోరిన సౌకర్యాలంలేంటి..? కోర్టు దేనికి అనుమతించిందో చూద్దాం..

Chandrababu: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతి.. బ్లాక్, ఖైదీ నెంబర్ ఏంటంటే..?
Chandrababu Arrest
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 11, 2023 | 12:32 PM

Chandrababu Naidu Arrest: 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటిసారి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆదివారం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆదేశాలతో సీఐడీ పోలీసులు ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. రాత్రి 9.30 గంటలకు రోడ్డు మార్గంలోనే భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. అక్కడే టీడీపీ నేతలకూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆదివారం రాత్రి 1.20 నిమిషాలకు చంద్రబాబు కాన్వాయ్‌ రాజమండ్రి జైల్‌కు చేరుకుంది.

11:05 గంటలకు ఏలూరు దాటిన కాన్వాయ్‌

ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్న సమయంలో… చంద్రబాబు కాన్వాయ్‌ను టీవీ9 కెమెరా ఫాలో అయింది. ప్రతి సెకన్‌ లైవ్‌ కవరేజ్‌ చేసింది. 10:14PMకు చంద్రబాబు కాన్వాయ్‌ గన్నవరం దాటాక పలువురు యువకులు ఆపారు. దీంతో మూడు నిమిషాలపాటు చంద్రబాబు కాన్వాయ్‌ ఆగింది. ఆ తర్వాత హనుమాన్‌ జంక్షన్‌ బైపాస్‌ మీదనుంచి రాత్రి 11గంటల05 నిమిషాలకు చంద్రబాబు కాన్వాయ్‌ ఏలూరు దాటి దూసుకెళ్లింది. మార్గ మధ్యలో రోడ్డుకు ఇరు వైపుల కనిపించిన టీడీపీ కార్యకర్తలకు కార్లోనుంచే చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

12:36 గంటలకు కొవ్వూరు వద్ద ఆగిన కాన్వాయ్‌

గుండుగొలనుకు చేరుకునే సరికి 11:30PM దాటింది. అక్కడి నుంచి 11:48PMకు భీమడోలు చేరుకుంది. నల్లజర్ల దాటి 12గంటల 36 నిమిషాలకు కొవ్వూరు చేరుకుంది. అక్కడ కాసేపే కాన్వాయ్‌ ఆపారు. ఆ గ్యాప్‌లో చంద్రబాబు రెస్ట్‌ తీసుకున్నారు. తిరిగి 12.50కి బయల్దేరింది. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు ఒంటిగంట.20నిమిషాలకి చంద్రబాబు కాన్వాయ్‌ చేరుకుంది. భారీ వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టింది.

ఇక రాజమహేంద్రవరం జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటే రాజమహేంద్రవరానికి నారా లోకేష్‌, టీడీపీ నేతలు వెళ్లారు. అయితే వారిని పోలీసులు జైలు బయటే నిలిపివేశారు. అయితే కొంత సమయం తర్వాత అధికారుల నుంచి అనుమతి రావడంతో లోకేశ్‌ను జైలులోనికి అనుమతించారు. లోపల పేపర్‌ వర్క్‌ ప్రకియ పూర్తికావడంతో జైలు వద్ద నుంచి లోకేష్‌ వెళ్లిపోయారు.

స్నేహ బ్లాక్‌ – ఖైదీ నెంబర్‌ 7691

కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు కోసం జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు అధికారులు. చంద్రబాబుకి ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు జైలు అధికారులు. జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జైలు చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రాజమహేంద్రవరం జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు ఏసీబీ కోర్టును కోరారు. తన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని చంద్రబాబు వెల్లడించారు. దీంతో చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని ధర్మాసనం పేర్కొంది. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స, ఇంటి ఆహారం తీసుకునేందుకు అనుమతించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

చంద్రబాబుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్

విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన  అనుమతి మేరకు సోమవారం ఉదయం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ ను ఇంటినుంచి అందించారు. రాజమండ్రికి చెందిన టీడీపీ మాజీ మేయర్ పరిమి వాసు నివాసం నుంచి చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లారు. ఇంటి భోజనం అనుమతి ఉండటంతో ఫ్రూట్ సలాడ్ పంపిన కుటుంబ సభ్యులు.. మధ్యాహ్నం, రాత్రికి కూడా ఆహారాన్ని వాసు ఇంటి నుంచే పంపనున్నారు. ఈ మేరకు నారా లోకేష్ తో పాటు చంద్రబాబు భద్రత సిబ్బంది అక్కడే ఉండి.. చంద్రబాబుకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుతున్నారు. రాజమండ్రికి కూతవేటు దూరంలోనే మాజీ కార్పొరేటర్ పరిమి వాసు నివాసం ఉండటంతో అక్కడినుంచి ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ