AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababau Naidu: మోసపూరిత ప్రకటనలతో ప్రాంతాల మధ్య చిచ్చు.. సీఎం జగన్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విశాఖపట్నాన్ని మింగేసి ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు...

Chandrababau Naidu: మోసపూరిత ప్రకటనలతో ప్రాంతాల మధ్య చిచ్చు.. సీఎం జగన్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
Chandrababu
Ganesh Mudavath
|

Updated on: Oct 13, 2022 | 6:54 AM

Share

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విశాఖపట్నాన్ని మింగేసి ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా.. కంపెనీలను అక్కడి నుంచి వెళ్లగొట్టిన వారు వైజాగ్ ప్రజల గురించి మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు. ‘సేవ్ ఉత్తరాంధ్ర’ పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు టీడీపీ నిలబడుతోందని హామీ ఇచ్చారు. బోల్డ్​గా ఉండే బాలకృష్ణ స్టైల్ కారణంగానే ఆ టాక్‌ షో అంత హిట్ అయ్యిందని చెప్పారు. నాడు అధికార మార్పిడి జరిగిన సమయంలో ఏం జరిగిందో షోలో చర్చకు వచ్చిందని తెలిపారు. దశాబ్దాలుగా బురద వేస్తున్న అంశంలో ఓపెన్​గా పలు విషయాలు మాట్లాడానని చంద్రబాబు చెప్పారు.

ముందే ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో పార్టీ నేతలు రెడీగా ఉండాలి. గెలుస్తామనే నమ్మకం కల్పించాలి. అందుకు తగ్గట్టుగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాలు నష్టపోయాయి. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి. మూడు రాజధానులు అంటూ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు చెపుతున్నా ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ సీఎం జగన్ జనాన్ని మోసం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇంచార్జ్​లు గట్టిగా పనిచేయాలి.

– నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. విశాఖలో భూఅక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మూడు రాజధానులతో సీఎం జగన్‌ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అర్థమేంటో జగన్ రెడ్డికి తెలుసా అని నిలదీశారు. అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.