AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: కూల్చడం కాదు కట్టి చూపించండి.. సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు తొలగించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నేరాలు విచ్చలవిడిగా..

Chandrababu Naidu: కూల్చడం కాదు కట్టి చూపించండి.. సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..
Chandrababu Naidu
Ganesh Mudavath
|

Updated on: Nov 06, 2022 | 7:13 AM

Share

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు తొలగించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. దాడులు, కూల్చివేతలు, హింస, అక్రమ అరెస్టులు కామన్ అయిపోయాయన్నారు. కూల్చడం కాకుండా ఏదైనా కట్టి చూపించాలని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందన్న చంద్రబాబు.. జగన్ చేసే తప్పులు వంద దాటాయని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ దుర్బుద్ధి, రాజకీయ కక్షను ప్రజలు అర్థం చేసుకోలేని స్థితిలో లేరని పైర్ అయ్యారు. మరోవైపు.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో చంద్రబాబు కాన్వాయ్ పై రాయి దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ విశాల్‌గున్నీ ఆధ్వర్యంలో విచారణ వేగవంతంగా సాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో చంద్రబాబు సీఎస్ఓకు గాయమైంది. ఘటనపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోడ్‌షో వీడియో ఫుటేజీలను సేకరిస్తున్నారు.

ఇప్పటం ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాక్షన్ కు అలవాటుపడిన సీఏం కావాలని కుట్రతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ఆరోపించారు. రహదారులపై గుంతలను పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. ఇప్పటం గ్రామాన్ని సందర్శించిన అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ మాట్లాడారు. 15 అడుగుల రోడ్ల విస్తరణ చేయలేరు కానీ.. 70 అడుగుల రోడ్డును 100 అడుగులు చేయడానికి మాత్రం అత్యవసరంగా అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఇప్పటం గ్రామం జనసేన పార్టీకి అండగా నిలబడింది. అలాంటి వారికి కష్టం వచ్చింది. మేము ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం. ఇప్పటం గ్రామస్తులకు చివరి వరకు తోడుగా ఉంటాం. ఎన్ని కేసులు, మరెన్ని నిర్బంధాలు ఎదురైనా ఈ పోరాటం ఆగదు. ప్రాణం ఉన్న మనుషులు నివసిస్తున్న ఇళ్లకు లేని విలువ.. ప్రాణం లేని వైఎస్‌ విగ్రహానికి ప్రభుత్వం విలువ ఇస్తోంది. హత్యలు చేసినవారిని పోలీసులు కాపాడుతున్నారు. అత్యాచారాలు చేసేవారికి రక్షణగా, కూల్చివేసేవారికి కొమ్ము కాసేలా పోలీసు వ్యవస్థ ఉంది.

ఇవి కూడా చదవండి

       – పవన్ కల్యాణ్, జనసేన అధినేత

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి