AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకండి..

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పాడి పశువులు, పెంపకం యూనిట్లకు రూ.75,000 వరకు సబ్సిడీతో రుణాలు అందిస్తుంది. అంతేకాదు చిన్న పరిశ్రమలు, వ్యవసాయ పరికరాల కొనుగోలుకు కూడా రాయితీతో కూడిన లోన్లు ఇస్తుంది.

Andhra Pradesh: మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వకండి..
Subsidy Loans For Women's Business Units In Ap
Krishna S
|

Updated on: Oct 08, 2025 | 2:04 PM

Share

ఏపీ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, వారిని వ్యాపారవేత్తలుగా మార్చాలని ప్రణాలికలు రచిస్తోంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారీ సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తోంది. ఈ రుణాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం వెలుగు, పశుసంవర్ధక శాఖ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాయి.

మొదటగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్ల కోసం రుణాలను అందిస్తారు. ఈ పథకంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చాలా ఎక్కువగా ఉంది. లక్ష విలువైన యూనిట్‌కు ప్రభుత్వం రూ.35వేల ప్రభుత్వ సబ్సీడి ఇస్తుండగా.. రూ.65 వేలు చెల్లించాలి. అదేవిధంగా 2లక్షల విలువైన యూనిట్‌కు రూ.75వేల వరకు సబ్సీడీ వస్తుండగా.. రూ. 1.25 లక్షలు తిరిగి చెల్లించాలి.

చిన్నతరహా పరిశ్రమలు – వ్యవసాయ పరికరాలకు రుణాలు

పశుపోషణతో పాటు ఇతర చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం రుణాలతో ప్రోత్సాహం అందిస్తోంది. బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ల వంటి చిన్న పరిశ్రమలకు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు అయ్యే ఖర్చులో భారీ సబ్సిడీతో కూడిన లోన్లు అందిస్తుంది. వరికోత యంత్రాలు, రోటావేటర్ల వంటి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు విలువైన యూనిట్లపై ఏకంగా రూ. 1.35 లక్షల వరకు రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహిళలు ఈ సబ్సిడీలు, రుణాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందాలని, ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అంతేకాకుండా మహిళల కోసం భవిష్యత్తులో మరిన్ని పథకాలను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..