
ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని సాగించాయి. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయ ప్రచారంలో స్పీడ్ పెంచారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే అంటూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళంలో చంద్రబాబు తొలి సంతకంపై క్లారిటీ ఇచ్చారు. 11 సార్లు డీఎస్సీ పెట్టిన ఘనత టిడిపిదే అన్నారు చంద్రబాబు. మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెడతామన్నారు. ఎన్డీఏను గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు అంటే బ్రాండ్ అని ట్రెండ్ మార్క్అనిప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్ ఆలోచనలు స్వార్థం కోసమైతే తన ఆలోచనలు జనం కోసమన్నారు. సీఎం జగన్ను టార్గెట్ చేసిన చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఎలాంటి కోతల్లేని విద్యుత్ సరఫరా చేశానని.. ఆ ఘనత తనదేనన్నారు. ధరలు పెంచకుండా నాణ్యమైన మద్యం సరఫరా చేసిన పాలన తమదే అని గుర్తు చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నది తన మార్క్ అన్నారు చంద్రబాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలు అందరినీ మార్పు చేసి మంత్రి పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత స్పీడ్ అవసరమో అంత స్పీడ్ డ్రైవ్ చేసే అనుభవం తనకు ఉందన్నారు. నా బస్ ఎక్కండి.. సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది. చంద్రన్నే బస్ డ్రైవర్ కనుక నో యాక్సిడెంట్ అన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి కంటే రానున్న ఐదేళ్లలో అంత కన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సోమశిల, స్వర్ణముఖి ద్వారా శ్రీకాళహస్తి, తిరుపతి, నగరికి నీళ్లు తీసుకు వస్తానన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..