CBN Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా.. ఈ రోజు టోటల్ అప్‌డేట్స్

చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేసి అత్యవసరంగా విచారించాలని కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యవహారమని.. అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సుప్రీంకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వద్ద లూథ్రా ప్రస్తావించారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడగగా ఈనెల 8న అరెస్ట్‌ చేశారని లూథ్రా తెలిపారు. దీంతో రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని లూథ్రాకు సీజేఐ సూచించారు. ఈ రోజు వివిధ పిటిషన్లపై జరిగిన వాదనలు, కోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు తెలుసుకుందాం..

CBN Arrest: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా.. ఈ రోజు టోటల్ అప్‌డేట్స్
Chandrababu Naidu
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 25, 2023 | 4:33 PM

స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు రేపటికి వాయిదా పడ్డాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు రేపు వింటామన్న విజయవాడ ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారని సీనియర్‌ న్యాయవాది సుంకర కృష్ణమూర్తి, ఏపీ సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద వెల్లడించారు. అంతకు ముందు చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేసి అత్యవసరంగా విచారించాలని కోరారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యవహారమని.. అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సుప్రీంకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వద్ద లూథ్రా ప్రస్తావించారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడగగా ఈనెల 8న అరెస్ట్‌ చేశారని లూథ్రా తెలిపారు. దీంతో రేపు మెన్షన్‌ లిస్ట్‌ ద్వారా రావాలని లూథ్రాకు సీజేఐ సూచించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.

మరోవైపు చంద్రబాబుతో ఆయన భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ములాఖాత్‌ అయ్యారు. సీఐడీ విచారణ నేపథ్యంలో గతవారం ఒక ములాఖాత్‌ నిరాకరించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ప్రజల కోసమే పనిచేశారని భువనేశ్వరి అన్నారు. ఇవాళ జగ్గంపేటలో ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జోతుల నెహ్రూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబును రెచ్చగొడుతున్నారని, ఆయన సింహంలా గర్జిస్తు బయటకు వస్తారని అన్నారు. ప్రజలే దేవుళ్లనని తన తండ్రి NTR చెప్పిన మాటలను తాము ఏనాడు మర్చిపోలేదని భువనేశ్వరి తెలిపారు. తమకున్న దాంతో తాము సంతృప్తి చెందుతున్నామని అన్నారు. ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు.

బాబును 2 రోజులు విచారించిన సీఐడీ

ఇక స్కిల్‌ స్కామ్‌లో రెండు రోజుల పాటు చంద్రబాబును పదిన్నర గంటలు విచారించింది సీఐడీ. 30 అంశాలకు సంబంధించి 120కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. మొదటి రోజు 30 శాతమే విచారణ జరిగిందని చెబుతున్నారు. మొదటి రోజు విచారణలో చంద్రబాబు ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. పూర్తి స్థాయిలో తెలుసుకుని విచారించాలని చంద్రబాబు కామెంట్‌ చేసినట్లు చెబుతున్నారు. ఇక 2వ రోజు కూడా బాబును కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని కోణాల్లో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించింది. ఆధారాలు, డాక్యుమెంట్స్ ముందు పెట్టి విచారణ జరిపారు. చాలా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం దాటవేశారని సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం