AP High Court: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు.. నేడు ఏపీ హైకోర్టులో విచారణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హై కోర్ట్‌లో విచారణ జరగనుంది. ఇప్పటికే 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్‌ను సీఐడీ అధికారులు దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని అడిషనల్ అఫిడవిట్‌లో సీఐడీ పేర్కొంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హై కోర్ట్‌లో విచారణ జరగనుంది. ఇప్పటికే 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్‌ను సీఐడీ అధికారులు దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయని అడిషనల్ అఫిడవిట్‌లో సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దాఖలు చేసిన పిటిషన్లపై నేడు తన వాదనలను సీఐడీ అధికారులు హైకోర్టు న్యాయమూర్తికి వినిపించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ముందు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన బాబుకు పూర్తి బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో పిటిషన్ వేశారు. స్కిల్ స్కామ్‌లో లోతైన విచారణకు సీఐడీని ఆదేశించాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఉండవల్లి తన పిటిషన్లో ప్రతివాదులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతో పాటూ 44 మంది ఉన్నట్లు పొందుపరిచారు. వీరందరికీ ఏపీ హైకోర్టులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేతపై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోందని చెబుతూ ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు ఉండవల్లి. ఇదే కేసులో నేడు మరోసారి విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..