AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: షాప్‌లో మటన్ కొంటున్నారా..? అయితే బీ కేర్ ఫుల్..

ఆశ్చర్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా కాస్మోపాలిటన్ సిటీ ఆయిన విశాఖలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా తూకంలో మోసాలు ఉంటున్నాయి. ఎక్కువగా చికెన్‌, మటన్‌ దుకాణాల్లో వ్యాపారులు దారుణంగా మోసం చేస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ప్రతి వారం కనీసం ఐదు కేసులైనా నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. మటన్ షాప్స్ దగ్గర వినియోగదారులు ఎక్కువసేపు ఉండలేరు, మటన్ ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటుంటారు. అక్కడే వినియోగదారుడి బట్టి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు.

Andhra Pradesh: షాప్‌లో మటన్ కొంటున్నారా..? అయితే బీ కేర్ ఫుల్..
Mutton
Eswar Chennupalli
| Edited By: Venkata Chari|

Updated on: Nov 29, 2023 | 6:08 AM

Share

Andhra Pradesh: మటన్ తూకాల మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒక్క మటన్ అని కాదు కానీ ప్రతిదీ మోసమే. చివరకు తూకాలలో కూడా మోసాలకు అడ్డూ అదుపు లేకుండా కల్తీ వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయ్. తూకంలో జరిగినన్ని మోసాలు మరే ఇతర ప్రాంతాల్లో జరగవంటే కచ్చితంగా అతిశయోక్తి కాదు. పాల ఉత్పత్తుల నుంచి పప్పు దినుసుల వరకు, కిరోసిన్‌ నుంచి కూరగాయల వరకు అన్నీ ఫాల్తూ లెక్కలే. చివరకు చిల్లర కొట్టు బండి వాడి నుంచి బడా బడా షాపింగ్ మాల్స్‌ వరకు ఇదే పరిస్థితి. ఎలక్ట్రానిక్‌ వెయిట్ మిషన్‌లలో మోసం, గోల్డ్ కాటా మిషన్ల లో మోసం , ఒకటేముంది లే… ఎక్కడ పడితే అక్కడ మోసాలే.

ఈ మోసాల్లో కూడా పలు రకాలు. పలువురు వ్యాపారులు సంవత్సరాల తరబడి అవే తూకంరాళ్లను వినియోగిస్తుంటారు, ఎంతలా అంటే ఆ కిలో తూకంరాయి ని చూస్తే ఆశ్చర్యంగా దానిపై ముద్రించిన అక్షరాలు సైతం అరిగిపోయి కనిపిస్తాయి. ఇలా వ్యాపారులు తూనికలు, కొలతల్లో యధేచ్చగా మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను దొచేస్తూ ఉంటారు. ఇక చికెన్ మటన్ వాటిల్లో అయితే ఇలాంటి చీప్ ట్రిక్స్ మరీ ఎక్కువ. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌ వెజ్‌ మార్కెట్‌లన్నీ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. నిండుగా మారుతాయి. ఆరోజు మటన్‌, చికెన్‌, ఫిష్‌ లకు విపరీతమైన గిరాకీ. వాటికోసం బారులు తీరి మరీ కొంటూ ఉంటారు. ఆ రద్దీని అలుసుగా తీసుకుని మార్కెట్‌ లో మరీ మోసాలకు పాల్పాడుతున్నారు పలువురు వ్యాపారులు.

విశాఖ లో మరీ ఎక్కువ..

ఇటీవల హనుమంతువాక జంక్షన్‌లోని ఓ మటన్‌ దుకాణంలో మూడు కిలోలు కొనుగోలు చేసిన రవి అనే ఇక వినియోగదారుడికి ఆశించిన స్థాయిలో తూకం లేకపోవడంతో అనుమానం వచ్చింది. దాన్నే మరో దుకాణంలో తూకం వేయించగా 2 కేజీల 700 గ్రాముల మాత్రమే వచ్చింది. 300 గ్రాములు తగ్గిపోయింది. రవి మళ్లీ వెళ్లి దుకాణదారుడిని ప్రశ్నించినా సమాధానం కరువైంది. వెంటనే అప్రమత్తమైన రవి అధికారులకు ఫిర్యాదు చేయగా, తనిఖీల్లో మోసం తేలడంతో ఆ మటన్ షాప్ యజమానికి ఫైన్ వేశారు తూనికలు, కొలతల అధికారులు. ఒకవేళ రవి కానీ అప్రమత్తం గా లేకపోయినా, అవగాహన లేకపోయినా దుకాణదారుడికి ఆ మాత్రం పనిష్మెంట్ ఉండేది కాదు

ఇవి కూడా చదవండి

ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. పలువురు వ్యాపారులు వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు.మోసాలపై అవగాహన లేకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారు. వీటిపై ఎవరికి ఫిర్యాదుచేయాలో తెలియక చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఉత్తరాంధ్ర లో మొత్తం 759 కేసులు..

ఈ తరహా మోసాలను ఫిర్యాదు చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. చలా తక్కువ మంది మాత్రమే చేస్తారు. ఆలా చాలా కొంతమంది చేసిన ఫిర్యాదులతో తూనికలు కొలతల శాఖ అధికారులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇటీవల కాలంలో 759 తూకంలో మోసం కేసులు నమోదుచేశారు. వీటిలో ఒక్క విశాఖ జిల్లాలోనే 90 కాగా అనకాపల్లి జిల్లాలో చాలా ఎక్కువ గా 424, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 45 నమోదు అయ్యాయి. అనకాపల్లి జిల్లా పలు హోల్ సేల్ వ్యాపారాలకు నిలయంగా ఉండడం తో అక్కడ మోసాలు కూడా అదే తరహా లో నమోదయ్యాయి. ఇక ప్యాకేజీ నిబంధనలు పాటించకుండా మోసం చేస్తున్న వారిపై పలు కేసులు పెట్టారు. జిల్లాలలో ఈ తరహా మోసాలు చేస్తున్న వ్యాపారులు, వ్యాపారసంస్థలపై విశాఖ లో 394, అనకాపల్లి లో 211, అల్లూరి జిల్లాలో 11 మొత్తంగా 622 కేసులు నమోదు చేశారు. ఇక ఫైన్ రూపంలోఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వసూలైన మొత్తం 83 లక్షల 59 వేల 500 అంటే ఏ స్థాయిలో మోసాలు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు.

చికెన్, మటన్ తరహా కేసులే ఎక్కువ..

ఆశ్చర్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో, ముఖ్యంగా కాస్మోపాలిటన్ సిటీ ఆయిన విశాఖ లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా తూకంలో మోసాలు ఉంటున్నాయి. ఎక్కువగా చికెన్‌, మటన్‌ దుకాణాల్లో వ్యాపారులు దారుణంగా మోసం చేస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ప్రతి వారం కనీసం ఐదు కేసులైనా నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. మటన్ షాప్స్ దగ్గర వినియోగదారులు ఎక్కువ సేపు ఉండలేరు, మటన్ ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటుంటారు. అక్కడే వినియోగదారుడి బట్టి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు.

దీనిపై తూనికలు, కొలతల శాఖ ఉప నియంత్రణ అధికారి కె.థామస్‌ రవికుమార్‌ టీవీ9 తో మాట్లాడుతూ మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా వ్యాపారులు ఈ తరహా తూకాల మోసాలకు పాల్పడుతున్నట్లు ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ శాఖ కార్యాలయాలు సమీపంలో ఎక్కడ అందుబాటులో ఉంటాయో వెబ్ సైట్ లో వివరాలు పొందు పరుస్తామన్నారు. అదే సమయంలో టోల్‌ ఫ్రీ నంబరు 1967కుగానీ, విశాఖ అయితే ఆఫీస్ ఫోన్‌ నంబరు 0891 2799551కు గానీ ఫిర్యాదు చేయవచ్చనీ వివరించారు. ఆఫీస్ లో నిరంతరం ఉమ్మడి జిల్లా జోనల్‌ కార్యాలయ ఉప నియంత్రణ అధికారితోపాటు ముగ్గురు అసిస్టెంట్‌ కంట్రోలర్స్‌, మరో నలుగురు ఇన్‌స్పెక్టర్లు ఈ తరహా మోసాల నియంత్రణకు నిరంతరం కృషి చేస్తుంటారని వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..