AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anakapalle: వలలో చిక్కిన 27 కిలోల కచ్చిడి చేప.. రూ. 3.90 లక్షల రికార్డు ధర.. ఎందుకంత డిమాండంటే.?

ఎప్పుడూ మాదిరిగానే మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడు వేటకు వెళ్లాడు. గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో వల విసిరాడు. వలకు ఏదో చిక్కింది. కాస్త బరువుగా కూడా అనిపిస్తుంది. సహచరులతో కలిసి మెల్లగా వల లాగారు. ఆ వలకు మామూలు చేప కాదు భారీ కాయంతో కూడిన చేప చిక్కింది. ఆ వలకు చిక్కిన చేప మామూలు చేప కాదు. గోల్డెన్ ఫిష్‌గా పిలుచుకునే కచ్చిడి చేప.

Anakapalle: వలలో చిక్కిన 27 కిలోల కచ్చిడి చేప.. రూ. 3.90 లక్షల రికార్డు ధర.. ఎందుకంత డిమాండంటే.?
Fish
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 28, 2023 | 7:32 PM

Share

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామం. అక్కడ మత్స్యకారులే నివాసం ఉంటారు. వారి జీవనాధారం చేపల వేట. ఎప్పుడూ మాదిరిగానే మెరుగు నూకయ్య అనే మత్స్యకారుడు వేటకు వెళ్లాడు. గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో వల విసిరాడు. వలకు ఏదో చిక్కింది. కాస్త బరువుగా కూడా అనిపిస్తుంది. సహచరులతో కలిసి మెల్లగా వల లాగారు. ఆ వలకు మామూలు చేప కాదు భారీ కాయంతో కూడిన చేప చిక్కింది. ఆ వలకు చిక్కిన చేప మామూలు చేప కాదు. గోల్డెన్ ఫిష్‌గా పిలుచుకునే కచ్చిడి చేప. దాన్నే కిచిడీ ఫిష్ అని కూడా అంటుంటారు. బోటుపై ఎక్కించుకుని హుషారుగా ఒడ్డుకొచ్చేసారు. విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. చేపను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అంతే ఆసక్తిగా ఆ చేపను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఇక వేలం నిర్వహించక తప్పలేదు.

3.90 లక్షలు పలికిన చేప..

27 కిలోల ఈ చేపను వేలానికి పెట్టారు. మెరుగు కొండయ్య అనే వ్యక్తి వచ్చి.. చేపను సొంతం చేసుకున్నాడు. మెరుగు కొండయ్య మూడు లక్షల 20 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. దీంతో నూకయ్య కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక్క రోజులోనే ఆ మత్స్యకారుడు లక్షాధికారి అయిపోయాడు.

ఎందుకంత డిమాండ్ అంటే ..?

సముద్ర జలాల్లో అరుదుగా లభించేది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్ని గోల్డెన్ ఫిష్‌గా భావిస్తారు. అత్యంత అరుదుగా వలకు చిక్కుతుంటాయి. ఇవి ఒక చోట ఉండవు. వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర జలాల్లో సంచరిస్తూ ఉండడం ఈ చేప లక్షణం. చేప మాంసం చాలా రుచిగా ఉండడంతో పాటు.. ఔషధ గుణాలతో కూడుకున్నదని అంటుంటారు. అందుకే ఆ చేపకు అంత డిమాండ్ మరి. కచ్చిడి చేపలో మగ చేప బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ చేపల్లో పొట్ట భాగం చాలా విలువైనదట. చేప బరువును బట్టి దాని పొట్ట భాగమే ఏకంగా 80 వేల వరకు ధర పలుకుతుందట.

మందులు, ఔషధాల్లో ఈ చేపను వినియోగిస్తుంటారు అనేది మత్స్యకారులే చెబుతున్నారు. అందుకే.. జీవితంలో ఒక్కసారైనా తమ వలకు ఇలాంటి చేపలు చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారట. ఎవరికైతే ఈ చేప చిక్కుతుందో.. వాళ్ల పంట పండినట్లే. అందుకే ఈ చేపకు అంతటి ప్రత్యేకత..!

Fish 1

Fish 1

Follow Us
పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు 2027
పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు 2027
ఈ రెండు స్కూటర్స్‌లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్‌
ఈ రెండు స్కూటర్స్‌లో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్‌
మహీంద్రా కార్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా
మహీంద్రా కార్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా
బ్యాంకింగ్ కస్టమర్లకు పెద్ద రిలీఫ్.. ఇకపై ఫ్రీ..
బ్యాంకింగ్ కస్టమర్లకు పెద్ద రిలీఫ్.. ఇకపై ఫ్రీ..
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఒంటరి మహిళతో సీఐ పెళ్లి.. మరో లేడీ గుట్టుగా యవ్వారం.. కట్ చేస్తే
ఒంటరి మహిళతో సీఐ పెళ్లి.. మరో లేడీ గుట్టుగా యవ్వారం.. కట్ చేస్తే
రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. గుగ్గిల్లు
రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. గుగ్గిల్లు
వాట్సాప్‌లో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే.. నెక్ట్స్ బాధితులు మీరే
వాట్సాప్‌లో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే.. నెక్ట్స్ బాధితులు మీరే
మళ్లీ జంటగా కనిపించిన తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. వీడియో ఇదిగో
మళ్లీ జంటగా కనిపించిన తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. వీడియో ఇదిగో
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత బీమా.. ఏది బెస్ట్..?
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత బీమా.. ఏది బెస్ట్..?