AP News: రండి బాబు రండి.. అన్లిమిటెడ్ బిర్యానీ.! ఆశపడి తీరా అక్కడకు వెళ్తే..
మటన్ ఫ్రై.., చికెన్ లాలిపాప్స్, చిల్లీ లివర్, చికెన్ కర్రీ.. నోరూరించే నాన్ వెజ్ వంటకాలు అంటారు..! రండి బాబు రండి.. అన్లిమిటెడ్ బిర్యానీ..! ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి జనాల ను ఎట్రాక్ట్ చేస్తారు...! తీరా అక్కడకు వెళ్తే.. పాసిపోయిన వాటినే మళ్లీ మళ్లీ వేడి చేసి ఫ్రెష్‌గా వడ్డిస్తున్నారు.
మటన్ ఫ్రై.., చికెన్ లాలిపాప్స్, చిల్లీ లివర్, చికెన్ కర్రీ.. నోరూరించే నాన్ వెజ్ వంటకాలు అంటారు..! రండి బాబు రండి.. అన్లిమిటెడ్ బిర్యానీ..! ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టి జనాల ను ఎట్రాక్ట్ చేస్తారు…! తీరా అక్కడకు వెళ్తే.. పాసిపోయిన వాటినే మళ్లీ మళ్లీ వేడి చేసి ఫ్రెష్‌గా వడ్డిస్తున్నారు. దీంతో ముందు వెనుక ఆలోచించకుండా ఆవురావురుమంటూ లాగించేస్తున్నారు. కానీ.. వాటి వెనుక ఉన్న అసలు విషయం తెలిస్తే.. ఔరా అనక తప్పదు. విశాఖలో ఇలా ఎట్రాక్ట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి కొన్ని హోటళ్లల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టగా.. నాసిరకం నాన్ వెజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
విశాఖలోనే పలు హోటళ్లలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఆహారం నిల్వ ఉంచి వడ్డిస్తున్నట్టు సమాచారం అందటంతో సోదాలు చేశారు. జగదాంబ సెంటర్‌లోని హేలాపురి హోటల్‌లో శాంపిల్స్‌ను సేకరించారు. నిల్వ ఉంచిన మాంసాహారాన్ని వేడి చేసి వండిస్తున్నట్టు గుర్తించారు. నాసిరకం నాన్-వెజ్ వడ్డిస్తున్నారన్న సమాచారం అందుకున్న విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ స్వరూప రాణి నేతృత్వంలో అధికారులు.. హేలాపురి హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ కిచెన్‌లో ఫ్రీజర్లను ఓపెన్ చేశారు. మూతలు పెట్టి ఉన్న మరికొన్నింటి వాటిని తెరిచారు. దీంతో నాసిరకం నాన్ వెజ్ వంటకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం వండి ఉంచినట్టు గుర్తించి అక్కడ ఆహార పదార్థాలను పరిశీలించారు. నిల్వ ఉంచిన పదార్థాలను వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు గుర్తించారు. అలాగే మధురవాడలో జిషాన్ రెస్టారెంట్‌లో కూడా నిల్వ ఉంచిన ఆహారాన్ని అమ్ముతున్నట్టు గుర్తించి అమ్మకాలను నిలిపివేశారు. ఆయా హోటళ్లలో ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు.. ల్యాబ్‌కు పంపించామని అన్నారు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ స్వరూపారాణి.
ఆఫర్లతో మోసపోవద్దు..
హోటళ్లలో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తే దాని వెనక ఏదో మతలబు ఉందనే విషయం గుర్తించాలని అంటున్నారు అధికారులు. అన్‌లిమిటెడ్ బిర్యానీ.. పేరుతో ఆల్రెడీ మిగిలిపోయిన బిర్యానీలో ఉన్న చికెన్‌ను వేరు చేసి మళ్లీ.. రేపటికి వడ్డించేందుకు సిద్ధం చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే మిగిలిన నాన్ వెజ్ వంటకాలలోనూ.. పదేపదే వేడి చేస్తూ నిల్వ ఉంచిన ఆహారాన్ని సిద్ధం చేసి పెడుతున్నట్టు గుర్తించి నమూనాలను సేకరించారు. ఇదే విధంగా విశాఖలో మరికొన్ని రెస్టారెంట్ల పైన నిఘా పెట్టారు అధికారులు. కస్టమర్లు ఆయా హోటళ్లలో ఆహారం తినే ముందు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు అధికారులు.