AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: వాట్సాప్‌లో పరిచయం.. ఆపై అమెరికా‌లో ఉంటున్నానంటూ కవరింగ్.. సీన్ కట్ చేస్తే.!

తాను అమెరికాలో ఉంటానని ఆమెకు చెప్పాడు. అప్పటి నుండి అడపా దడపా వాట్సప్ కాల్ లో మాట్లాడుతుండేవాడు. ఈ పరిచయం కొనసాగుతుండగానే ఒక రోజు.. ఢిల్లిలోని కొరియర్ కార్యాలయం నుండి ఆమెన్ ఫోన్ వచ్చింది. మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని అందులో ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ ఉన్నాయని పార్శిల్ కార్యాలయం సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె తబ్బిబ్బైపోయింది.

Guntur: వాట్సాప్‌లో పరిచయం.. ఆపై అమెరికా‌లో ఉంటున్నానంటూ కవరింగ్.. సీన్ కట్ చేస్తే.!
Whatsapp
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 28, 2023 | 7:49 PM

Share

ఆమెది గుంటూరు.. బ్రాడీపేటలో నివాసం ఉంటుంది. తొమ్మిది నెలల క్రితం ఆమెకు వాట్సాప్‌లో మార్క్ హార్వే అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో ఉంటానని ఆమెకు చెప్పాడు. అప్పటి నుండి అడపా దడపా వాట్సాప్ కాల్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ పరిచయం కొనసాగుతుండగానే ఒక రోజు.. ఢిల్లిలోని కొరియర్ కార్యాలయం నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని అందులో ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్ ఉన్నాయని పార్శిల్ కార్యాలయం సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బైపోయింది. తనకు మార్క్ హార్వే వాటిని పంపించాడని సంతోషపడింది. అయితే వెంటనే ఫోన్‌లోని పార్శిల్ సిబ్బంది ఎక్సైజ్ సుంకం 25 వేల రూపాయలు కట్టాలని చెప్పారు. ఆమె వెంటనే గూగుల్ పే ద్వారా ఆ మొత్తాన్ని వారికి పంపింది.

ఇది జరిగిన గంట తర్వాత కొరియర్ నుండి మరోసారి కాల్ వచ్చింది. కొరియర్‌లో రెండు బంగారు గొలుసులు వచ్చాయని వాటికి ట్యాక్స్ కింది 70 వేల రూపాయలు చెల్లించాలని సిబ్బంది ఫోన్‌లోనే చెప్పారు. ఆమె ఆ మొత్తాన్ని కూడా వారికి పంపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరోసారి ఫోన్ వచ్చింది. ఈ సారి డబ్బు కట్టలు వచ్చాయని వాటికి పన్ను కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన ఆమె మార్క్ హార్వేకి ఫోన్ చేసింది.

మార్క్ హార్వే తనదైన శైలిలో ఆమెకు సమాధానం చెప్పాడు. ఆమెను ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతో డబ్బుల కట్టలు పంపానన్నాడు. అయితే అప్పటికే లక్ష రూపాయల వరకూ పన్నుల రూపంలో డబ్బులు కట్టిన ఆమె ఇక తనవద్ద డబ్బులు లేవని డబ్బుల కట్టలు వెనక్కి తెప్పించుకొని తాను కట్టిన నగదు వాపసు చేయాలని కోరింది. వీరిద్దరి మధ్య ఈ మాటలు కొనసాతుండగానే మరోసారి మార్క్ హార్వే నుండి ఫోన్ వచ్చింది. తాను త్వరలోనే ఇండియా వస్తున్నానని తనకు బ్యాంక్ ఖాతా కావాలని ఆమె పేరుతో ఒక ఖాతా ఓపెన్ చేసి వివరాలు పంపించమని చెప్పటం జరిగింది. ఆమె ఒక ఖాతా ఓపెన్ చేసి వివరాలు పంపింది. అయితే ఇంకో అకౌంట్ కూడా కావాలని ఆమెను బ్రతిమాలడటంతో రెండో అకౌంట్ కూడా ఓపెన్ చేసి వివరాలు పంపింది.

ఆ తర్వాత మార్క్ హార్వే నుండి ఫోన్స్ రావడం తగ్గిపోవడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకులకు వెళ్లి వివరాలు తీసుకుంది. రెండు అకౌంట్స్ ద్వారా 12 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు ఆమె గుర్తించింది. అయితే తన చేత ఉద్దేశపూర్వకంగానే అకౌంట్స్ ఓపెన్ చేయించి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని గుంటూరు పోలీసులకు స్పందనలో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించిన నేర విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు వెంటనే విచారణ జరపాలని సైబర్ సిబ్బందిని ఆదేశించారు. అయితే దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను