AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varupula Raja: వరుపుల రాజా మృతి టీడీపీకి తీరని లోటు.. చంద్రబాబు, లోకేష్ సంతాపం..

ఏపీలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడంతో టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Varupula Raja: వరుపుల రాజా మృతి టీడీపీకి తీరని లోటు.. చంద్రబాబు, లోకేష్ సంతాపం..
Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Mar 05, 2023 | 9:30 AM

Share

ఏపీలోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడంతో టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడలోని సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటలకు చికిత్స పొందుతూ వరుపుల రాజా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన ఇక లేరన్న విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నియోజకవర్గ శ్రేణులు కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజా.. గత మూడు రోజులుగా బొబ్బిలి, సాలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజా అంత్యక్రియలు ఆయన స్వస్థలం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో ఇవాళ జరగనున్నాయి.

పార్టీకి తీరని లోటు.. చంద్రబాబు..

కాగా.. వరుపుల రాజా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబుపేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. రాజా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరుకానున్నట్లు పేర్కొంటున్నారు.

పార్టీ యువ నేతను కోల్పోయింది.. నారా లోకేష్..

ఆత్మీయ స్నేహితుడు వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయింది. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను‌. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టిడిపికి తీరని లోటు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

తీవ్రంగా కలచి వేసింది..

వరుపుల రాజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం తెలియజేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..