Challa Family Dispute: ఒకవైపు కోడలు, ఇంకోవైపు పెద్ద కొడుకు.. చల్లా కుటుంబంలో వారసత్వ పోరు..
ఒక్క ఫొటో చల్లా కుటుంబం గుట్టును రోడ్డునపడేసింది. అవును, ఒకే ఒక్క ఫొటో ఫ్రేమ్.. చల్లా ఫ్యామిలీలో గొడవల్ని అందరికీ తెలిసే చేసింది. ఒకరేమో ఇంటి కోడలు, మరొకరు ఆ ఇంటి పెద్ద కొడుకు. వీళ్లిద్దరూ కుటుంబ వారసత్వంపై స్ట్రీట్ ఫైట్‌కి దిగారు. రాజకీయ వారసత్వం తనదంటే తనదంటూ కొట్లాటల వరకూ వెళ్లారు. అసలీ గొడవకు కారణమైన ఫొటో ఏంటి?. వీళ్లిద్దరి మధ్య ఆజ్యం పోసిన ఆ ఫొటో ఎవరిది?
ఒక్క ఫొటో చల్లా కుటుంబం గుట్టును రోడ్డునపడేసింది. అవును, ఒకే ఒక్క ఫొటో ఫ్రేమ్.. చల్లా ఫ్యామిలీలో గొడవల్ని అందరికీ తెలిసే చేసింది. ఒకరేమో ఇంటి కోడలు, మరొకరు ఆ ఇంటి పెద్ద కొడుకు. వీళ్లిద్దరూ కుటుంబ వారసత్వంపై స్ట్రీట్ ఫైట్‌కి దిగారు. రాజకీయ వారసత్వం తనదంటే తనదంటూ కొట్లాటల వరకూ వెళ్లారు. అసలీ గొడవకు కారణమైన ఫొటో ఏంటి?. వీళ్లిద్దరి మధ్య ఆజ్యం పోసిన ఆ ఫొటో ఎవరిది?
చల్లా రామకృష్ణారెడ్డి, సీమ జిల్లాల్లో ఈ పేరు తెలియనివారుండరు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి, తన చివరి రోజుల్లో ఎమ్మెల్సీ ఉంటూ మరణించారు. చల్లా అకాల మరణంతో ఆయన చిన్న కుమారుడు భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్. అయితే, ఊహించనివిధంగా భగీరథరెడ్డి కూడా మరణించడంతో చల్లా ఫ్యామిలీలో వారసత్వ యుద్ధం మొదలైంది. చల్లా రామకృష్ణారెడ్డి పెద్దకొడుకు విఘ్నేశ్వర్‌రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ కుటుంబీకులు ప్రకటించడంతో అసలు గొడవ మొదలైంది. ఆల్రెడీ జెడ్పీటీసీగా ఉన్న దివంగత భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి పోటీకి రావడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. శ్రీలక్ష్మి సెపరేట్‌గా ఆఫీస్ ఓపెన్ చేయడం, రాజకీయంగా తిరగడంపై చల్లా కుటుంబం గుర్రుగా ఉంది. అదిప్పుడు ఇలా రోడ్డుకెక్కింది.
అయితే, ఫొటో పేరుతో తనపై చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి, మేనల్లుడు రవీంద్రారెడ్డి, ఆడపడుచు కలిసి దాడి చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీలక్ష్మి. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఊరిలో ఉండొద్దని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోతున్నారు ఆమె.
చల్లా రామకృష్ణారెడ్డి ఫొటో కోసం ఒకరిపై మరొకరు పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్స్ చేసుకున్నారు శ్రీలక్ష్మి అండ్ విఘ్నేశ్వర్‌రెడ్డి. అయితే, రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారంటున్నారు చల్లా పెద్దకుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి. అంతేకాదు, తమ కుటుంబ ఆస్తులన్నీ శ్రీలక్ష్మి తనపై పేరును రాయించుకుందంటూ కీలక ఆరోపణలు చేశారు.
చల్లా ఫ్యామిలీ విభేదాలు రోడ్డునపడటమే కాకుండా పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లడంతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని రంగంలోకి దింపి… చల్లా ఫ్యామిలీతో చర్చలు జరిపింది. విభేదాలు పక్కనబెట్టి కుటుంబసభ్యులంతా ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించింది. అయితే, రాజకీయాల్లో ఎవరి దారి వారిదే అంటున్నారు విఘ్నేశ్వర్‌రెడ్డి. శ్రీలక్ష్మి కూడా తగ్గేదే లేదంటున్నారు. అవుకు ప్రజల కోసం ఇక్కడే ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. మరి, ఈ చల్లా వార్ ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..