Chalivendram: ఈ చలివేంద్రం వెరీ వెరీ స్పెషల్.. మనుషుల కోసం కాదు.. పక్షుల కోసం.. ఎక్కడంటే
ఆకలి , దప్పిక సృష్టిలో ప్రతి జీవికి ఒకేలా ఉంటాయి. అందుకే ఆకలితో వున్నవారికి అన్నదానం చేయటం మహా పుణ్యకార్యక్రమంగా నిర్వహిస్తుంటారు. ఇష్ట మైన దేవాలయం సందర్శించినప్పుడు, పెళ్లి , పుట్టిన రోజుల నాడు అన్నదానానికి డబ్బులు విరాళం గా ఇవ్వటం లేదా వ్యక్తిగతం గా ఆ కార్యక్రమం నిర్వహించటం పుణ్యమైన క్రియగా పరిగణించబడుతుంది. అయితే నోరు లేని మూగజీవులకు దాహం తీర్చేందుకు ఏపీ సర్కార్ తీసుకున్న చర్యలని ఆదర్శంగా తీసుకుని పక్షులకోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎక్కడంటే..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని పశువుల దప్పిక తీర్చేందుకు ప్రతిగ్రామంలోనూ నీటి తొట్టిలను ఏర్పాటుచేసింది. పెంపుడు జంతువుల విషయంలో వాటి పెంపకందారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాటిని కన్న బిడ్డలమాదిరిగా చూసుకుని సమయానికి ఆహారం, నీరు అందిస్తుంటారు. మరి ప్రకృతిలో సంచరించే ఇతర పక్షుల అవసరాలు ఎవరు తీరుస్తారు. ఈ ఆలోచన చాలామందికి వస్తుంది. అలాంటి ఆలోచన తోనే పిఠాపురంకు చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు లో పక్షులకు చలివేంద్రం ఏర్పాటు చేసింది.
పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గ్రామానికి చెందిన దంగేటి రామకృష్ణ ఇంటి నివాస పరిసరాల్లో వున్న చెట్లకు వరికంకులను ఏర్పాటు చేసి పక్షుల మంచిని అవసరాలకోసం చిన్న చిన్న టబ్స్ లో నీటిని చెట్లకొమ్మలకు వ్రేలాడ దీశారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి , పశుపక్ష్యాదులకు అవసరమైన ఆహారం, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు సద్గురువు అలీషా. ఇలాంటి కార్యక్రమాల వాళ్ళ పర్యావరణం కు మేలు జరిగటంతో పాటు మానవాళి మనుగడ సాఫీగా సాగేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




