AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: 2016లో ఆపేశాడు.. 2024లో మొదలు పెట్టాడు.. మధ్యాహ్నం వేళ సాయిబాబా గుడికి వెళ్లి..

అతని పేరు అమీర్ బాషా అలియాస్ జౌహారి.. గుంటూరులోని ఆనంద్ పేట ఒకటో లైన్ కు చెందిన అతని పేరు వింటేనే పోలీసులు సైతం వణికిపోతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 22 చైయిన్ స్నాచింగ్ కేసులున్నాయి. వీటితో పాటు ఒక చోరీ కేసు, మర్డర్ కేసు కూడా ఉంది.

Andhra: 2016లో ఆపేశాడు.. 2024లో మొదలు పెట్టాడు.. మధ్యాహ్నం వేళ సాయిబాబా గుడికి వెళ్లి..
Saibaba Temple (representative image)
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 16, 2025 | 11:32 AM

Share

అతని పేరు అమీర్ బాషా అలియాస్ జౌహారి.. గుంటూరులోని ఆనంద్ పేట ఒకటో లైన్ కు చెందిన అతని పేరు వింటేనే పోలీసులు సైతం వణికిపోతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 22 చైయిన్ స్నాచింగ్ కేసులున్నాయి. వీటితో పాటు ఒక చోరీ కేసు, మర్డర్ కేసు కూడా ఉంది. అతని సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. అయితే కొంతకాలం పాటు చోరీలు, చైయిన్ స్నాచింగ్‌లకు విరామం ఇచ్చి పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుతిరిగాడు. చివరికి పాత వృత్తిలోకి దిగి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల ప్రకారం.. కార్పెంటర్‌గా పనిచేసే అమీర్ బాషా 2006లోనే చోరిలు చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఒక హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. చైయిన్ స్నాచింగ్ లకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన అతనిలో మార్పు రాలేదు. దీంతో అతనిపై 2016లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. దీంతో అమీర్ కూడా నేరాలు చేయడం ఆపేశాడు.

అయితే కొద్దీ రోజుల క్రితం పట్టాభిపురం పీఎస్ పరిధిలో చైయిన్ స్నాచింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అడిషనల్ ఎస్పీ సుప్రజకు అమీర్ పై అనుమానం వచ్చింది. వివిధ సిసి కెమెరాల విజువల్స్ ను జల్లెడ పట్టిన పోలీసులు అమీర్ బాషా పనిగానే తేల్చారు. ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ముప్పై లక్షల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి.

Thief Arrested

Thief Arrested

2016లో చైయిన్ స్నాచింగ్ లకు విరామం ప్రకటించాడు అమీర్ బాషా.. ఆ తర్వాత 2024లో తిరిగి చైయిన్ స్నాచింగ్ లు చేయడం మొదలు పెట్టాడు. ఏడాది కాలంలోనే ఏడు చెయిన్ స్నాచింగ్ లు చేశాడు. గురువారం రోజు మధ్యాహ్న సమయంలో సాయి బాబా గుడికి వెళ్లే మహిళలే టార్గెట్ చేస్తాడు. పదిహేను రోజుల ముందుగానే రెక్కి నిర్వహించి అంతా ప్లాన్ చేసుకుంటాడు. గురువారం రాగానే అమలు చేస్తాడు. ఇలా ఇప్పటి వరకూ 22 చెయిన్ స్నాచింగ్ లు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో ఒప్పుకున్నాడు. అడిషనల్ ఎస్పీ సుప్రజ ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని పట్టుకున్నందుకు ఎస్పీ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?