Andhra Pradesh: సాగర నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ.. విశాఖలో పర్యాటకులను ఆకర్షిస్తోన్న..
విశాఖలో ఇప్పటికే విజ్ఞాన్ని అందిస్తోన్న సబ్ మెరైన్ మ్యూజియం, నేవల్ మ్యూజియం, సీ హరియర్ మ్యూజియం లతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనో గ్రఫి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ లాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారా నిరంతరం...
ప్రకృతి సిద్ధమైన అందాలకు నెలవైన విశాఖ, సముద్ర సంబంధిత విజ్ఞానానికి ఆవాసం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తూర్పు తీరంలో అత్యంత కీలకమైన సిటీ, తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రం కావడంతో సముద్ర విజ్ఞాన శాస్త్రం, సముద్రంలో లభించే మత్స్య శాస్త్ర పరిశోధనలు, నేవికి సంబందించిన అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతూ ఉండడం, వాటికి అనుబంధంగా మ్యూజియంలు ఏర్పాటు కావడం, విశాఖకు వచ్చే పర్యాటకులకు ఆ మ్యూజియంలను సందర్శించడం ద్వారా సముద్ర తీరంలో జరుగుతున్న అత్యద్భుత ఆవిష్కరణలు, అద్భుతాలను తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
అందుకే విశాఖలో ఇప్పటికే విజ్ఞాన్ని అందిస్తోన్న సబ్ మెరైన్ మ్యూజియం, నేవల్ మ్యూజియం, సీ హరియర్ మ్యూజియం లతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనో గ్రఫి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ లాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటి ద్వారా నిరంతరం ఇక్కడ పరిశోధన, అభివృద్ది జరుగుతూనే ఉంటుంది. తాజాగా నిర్మించిన మెరైన్ మ్యూజియం మరింత ఆకట్టుకుంటోంది.
ఫిషింగ్ హార్బర్ సమీపంలో…
విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న ఇండియన్ ఫిషరీస్ రీసెర్చ్ సంస్థ లో అత్యాధునికంగా నిర్మించిన మెరైన మ్యూజియంను సోమవారం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించారు. సువిశాల బంగాళాఖాతంలో లభ్యమయ్యే పలు రకాల మత్స్య సంపదను ఈ మెరైన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. దీనిద్వారా సముద్రంలో లభ్యమయ్యే మత్య్స రాశుల గురించి తెలుసుకోవడమే కాకుండా జువాలజీ అభ్యసించే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ కు ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈ మొత్తం మ్యూజియంలో అరుదుగా లభ్యమయ్యే సముద్రపు ఆవు చేప స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సముద్రపు పాము, మొసలి రకం సొరచేప, కలివిందలు సొరచేప, అండమాన్ నికోబార్ దీవుల్లో దొరికే గర్నాడ్స్, తిమింగలాలు ఆళ్ళ రొయ్యలు, గుర్రపు డెక్క పీతలు, అన్నింటికంటే మనం అత్యంత అరుదుగా చూసే సముద్రపు దోసకాయ, సముద్రపు లాంతరు, సీ అశ్వని చేపలు ఇక్కడ మనకు ప్రదర్శనలో కనిపిస్తాయి.
250 రకాల చేపల నమూనాలు..
ఈ మెరైన్ మ్యూజియంలో దాదాపు 250 నమూనాల చేపలను ప్రదర్శనగా ఉంచడం విశేషం. సాధారణంగా ప్రతి ఏటా నవంబరులో ఫిషింగ్ హార్బర్ జెట్టీల్లో నిలిచి ఉండే సర్వే నౌకల్లో ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జిబిషన్ లు ఈ తరహా చేపలను డిస్ ప్లే లో ఉంచుతూ విద్యార్థులకు ఆయా వెరైటీ లపై అవగాహన కల్పించే ప్రక్రియ చేస్తూ ఉంటుంది. మరోవైపు మత్స్య శాఖ ఈ మ్యూజియం నిర్వహణకు అత్యాధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. దశాబ్దాల క్రితం లభ్యమైన చేపల నమూనాలు డిస్టర్బ్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా రకాల చేపల్లో ఫార్మాలిన్ కలిపి భద్రపరుస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన గాజు జార్లను వినియోగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..