AP Award: ఏపీ సర్కార్‌కు గుడ్‌న్యూస్.. పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా..?
AP Award: మలేరియా (Malaria) నిర్మూలన విషయంలో అత్యుత్తమ పనితరు కనబర్చిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం లభించింది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని..
AP Award: మలేరియా (Malaria) నిర్మూలన విషయంలో అత్యుత్తమ పనితరు కనబర్చిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం లభించింది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోనుంది. మలేరియా నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా చేపట్టిన చర్యల వల్ల 2018లో 6,040 కేసులు నమోదు కాగా, 2021లో 1,139కి తగ్గాయి. ఇలా మలేరియా నిర్మూలనలో కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పురస్కారం ప్రకటించింది.
2021లో మొత్తం 75,29,994 రక్తపరీక్షలు నిర్వహించగా, అందులో 1,139 మందికి మలేరియా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో 2021లో 21.5 లక్షలు,. రాష్ట్రంలో మొత్తం 25.94 లక్షల దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి యేటా ఇళ్లలో దోమలను పారద్రోలేందుకు ఇండోర్ రెసిడ్యుయల్ కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఏడాది అన్ని ఆరోగ్య కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో దోమల నిరోధక వలలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఫ్రైడే- డ్రైడే పేరిట క్రిమి కీటక నిరోదక, ఆరోగ్య పరిరక్షణ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో దోమల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత సంవత్సరం మత్స్యశాఖ సమన్వయంతో 24 లక్షల గంబూజియా చేపలను పెంపకందారులకు పంపిణీ చేసింది. ఈ చర్యల ఫలితంగా… ఈ ఏడాది ఇప్పటి వరకూ కేవలం. 117 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: