Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Movie Theater: ఏపీలో మొదటి మొబైల్‌ సినిమా థియేటర్‌.. ఆ సినిమాతోనే ప్రారంభానికి ఏర్పాట్లు..

Mobile Movie Theater: ఏపీలో మొదటి మొబైల్‌ సినిమా థియేటర్‌.. ఆ సినిమాతోనే ప్రారంభానికి ఏర్పాట్లు..

Anil kumar poka

|

Updated on: Apr 25, 2022 | 8:24 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్‏ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‏ను ఏర్పాటుచేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్న రీతిలో మొదటిసారిగా మొబైల్ సినిమా థియేటర్‏ను ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి జిల్లాలోని రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‏ను ఏర్పాటుచేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్‏లో గాలినింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ థియేటర్‏ను రూపొందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన “పిక్చర్ డిజిటల్స్” సంస్ధ ఆంధ్రప్రదేశ్‏లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్లలో ఇది మొదటిదని నిర్వాకులు తెలిపారు. ఈ మొబైల్ ధియేటర్లు RRR మూవీ రిలీజ్‌నాటికే మొదలు కావాల్సి ఉంది…కాగా కొన్ని పర్మిషన్ల దృష్ట్యా ఆలస్యం కావడంతో.. మెగాస్టార్ ఆచార్య సినిమాతో ధియేటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు..ఇది ఒకప్పటి టూరింగ్ టాకీసులకు ఆధునికమైన, సౌకర్యవంతమైన రూపమని తెలిపారు. అలాగే.. దీనిని ట్రక్కులో ఎక్కడికైనా తీసుకుపోయి అమర్చుకోవచ్చు. ఈ మొబైల్ థియేటర్ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలో మరిన్ని చోట్ల ఇలాంటి థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.మొత్తం మొబైల్ ఎయిర్ బెలూన్ థియేటర్ లో 120 సిట్లతో పాటు 5.1 surround sound system తో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు… మల్టీప్లెక్స్ థియేటర్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా వాష్ రూమ్స్ , ఏసి తో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ ని వాడుతూ దీనిని కేవలం ఐదు నుంచి ఏడు రోజుల్లో పూర్తి చేశారు…. ఈ మొబైల్ ఎయిర్ బెలూన్ రూమ్ థియేటర్ ఇప్పుడు రాజానగరం లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుందని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..