YS Viveka: వివేకా హత్య కేసులో నేడు కీలక పరిణామాలు.. అటు సీబీఐ, ఇటు హైకోర్టు.. ఉత్కంఠగా విచారణల పర్వం..
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేకా ముఖ్య అనుచరుడు ఇనాయ్‌తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాశ్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించడానికి సిద్ధమైంది. అటు అవినాష్ బెయిల్ మేటర్ కూడా ఇవాళ సాయంత్రంలోగా తేలనుంది.
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేకా ముఖ్య అనుచరుడు ఇనాయ్‌తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాశ్ రెడ్డిలను సీబీఐ మరోసారి ప్రశ్నించడానికి సిద్ధమైంది. అటు అవినాష్ బెయిల్ మేటర్ కూడా ఇవాళ సాయంత్రంలోగా తేలనుంది.
వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయ్‌తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇద్దరి స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేస్తోంది. వివేకా హత్యకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ఇనాయ్ తుల్లా.. ప్రకాష్ రెడ్డి, ఉదయ్‌కుమార్ స్నేహితులు రాజు, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రాజేషలను కూడా సీబీఐ విచారించింది. అటు వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను కూడా సీబీఐ రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై మంగళవారమే విచారణ జరపాల్సిన హైకోర్టు.. బుధవారానికి వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందన్న హైకోర్టు తాజాగా గురువారానికి విచారణ వాయిదా వేసింది. గురువారం సాయంత్రం లోగా అవినాష్ బెయిల్ మ్యాటర్ తేలిపోనుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి పులివెందులలోనే ఉన్నారు.
మరోవైపు, వివేకా హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారంతో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..