Andhra Pradesh: సీబీఐకు ఎంపీ అవినాష్ మరో లేఖ.. విచారణకు రాలేనంటూ విజ్ఞప్తి..

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కాలేనన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజుల సమయం కావాలని కోరారు అవినాష్ రెడ్డి. ఈ మేరకు సీబీఐకి ఆయన లేఖ రాశారు. వాస్తవానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 22న సీబీఐ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఆయన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh: సీబీఐకు ఎంపీ అవినాష్ మరో లేఖ.. విచారణకు రాలేనంటూ విజ్ఞప్తి..
Avinash Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: May 21, 2023 | 7:43 PM

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కాలేనన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. విచారణకు హాజరయ్యేందుకు మరో 10 రోజుల సమయం కావాలని కోరారు అవినాష్ రెడ్డి. ఈ మేరకు సీబీఐకి ఆయన లేఖ రాశారు. వాస్తవానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 22న సీబీఐ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఆయన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐ కి లేఖ రాశారు అవినాష్ రెడ్డి. తన తల్లికి గుండె ఆపరేషన్ ఉందని వైద్యులు చెప్పారని, ఆమె కోలుకోవడానికి వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు విచారణకు హాజరుకాలేనని చెప్పారు. ఆ తరువాత విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే, అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా మరికాసేపట్లో కర్నూలుకు బయలుదేరేందుకు సీబీఐ అధికారుల బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..