Vyuham: వ్యూహంతో పొలిటికల్ హీట్ పెంచేసిన ఆర్జీవీ.. రిలీజ్ అప్పుడు రచ్చ తప్పదా

పుండుపైన కారం.. బొబ్బలెక్కిన ఆగ్రహాం.. అందుకు ప్రతీకారమే వ్యూహం అంటూ తను తీస్తున్న సినిమాపై ఫుల్‌ హైప్‌ పెంచేశారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. వ్యూహం మూవీ ఎవరి బయోపిక్‌ కాదూ.. సీక్వెల్‌ అంతకన్నా కాదు.. పొలిటికల్ కుట్రల విషం ఉంటుందని కథను కాస్త రివీల్ చేశారు. అయితే కుట్రలు ఎవరు చేశారు..? వాటికి ఎవరు బలయ్యారనేది మాత్రం వెయిట్ అండ్ సీ అంటున్నారు. వ్యూహం ట్రైలర్‌తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన ఆర్జీవీ.. పూర్తి స్థాయి సినిమాతో ఇంకెంత దుమారం రేపుతారో చూడాలి.

Vyuham: వ్యూహంతో పొలిటికల్ హీట్ పెంచేసిన ఆర్జీవీ.. రిలీజ్ అప్పుడు రచ్చ తప్పదా
Andhra CM Jagan Reddy - Director Ram Gopal Varma
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2023 | 2:55 PM

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 14: ఆర్జీవీ అంటేనే కాంట్రవర్శీకి కేరాఫ్‌. ఆయన మాటలు, చేతలు, సినిమాలు..ఇలా ఏం చేసినా వివాదమే. వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు పొలిటికల్‌గా ఎంత కాంట్రవర్సీ సృష్టించాయో… అంతకుమించి వ్యూహం మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్‌ కట్‌గా తెలుస్తోంది. మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటిది వ్యూహం, రెండోది శపథం పేరుతో రూపొందిస్తున్నారు. మూవీ బయోపిక్ కాదని, రియల్ పిక్ అంటున్నారు ఆర్జీవీ. టీజర్‌తోనే మూవీలో ఏదో ఉందనే లీకులిచ్చి తనదైన మార్క్‌ చూపించారు. మొదటి భాగం వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే.. రెండవ భాగం శపథంతో మరో షాక్ ఇస్తానంటున్నారు. వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ వ్యూహం, శపథం చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తంగా వ్యూహం స్టిల్స్, టీజర్, ట్రైలర్లతో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన ఆర్జీవీ పూర్తి స్థాయి సినిమాతో పొలిటికల్ దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ డ్రామా వ్యూహం. జగన్‌మోహన్‌రెడ్డి పాత్రలో అజ్మల్‌, భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ సినిమా బయోపిక్‌ కాదని, దానికన్నా లోతైన రియల్‌ సినిమా అని గతంలో ఆర్జీవీ లీకులిస్తూ వస్తున్నారు. అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం అంటూ బజ్ పెంచుతున్నారు.వ్యూహం మూవీ షూటింగ్ ప్రజంట్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పైన బ్యారేజిపై కొన్ని సీన్స్‌ చిత్రీకరిస్తున్న వర్మ ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేను నమ్మిన నిజాన్ని సినిమాలో చూపిస్తున్నా అన్నారు. ఇక ఈ వ్యూహం సినిమా 2024 ఏపీ ఎన్నికల కోసమే తీస్తున్నట్లు కుండ బద్దలుకొట్టేశారు వర్మ.. ఎన్నికల లక్ష్యంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా అందులో ఎటువంటి సందేహం, రహస్యం లేదంటున్నారు. తాను నమ్మిన నిజాన్ని సినిమాలో చూపిస్తున్నా అన్నారు. సినిమాల్లో నా అభిప్రాయాన్ని చెబుతున్నా, పొగడ్తలు అంటే తనకు చిరాకు అన్న వర్మ,, విమర్శలు అంటే మాత్రం చాలా ఇష్టం అన్నారు. తనకు ఏది ఆసక్తి ఉంటే అది చేస్తా అన్నారు.

అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే రామ్‌గోపాల్‌వర్మ… ఈ సినిమాను మొత్తం సెటైర్లతో నింపేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, రీసెంట్‌గా కూడా పవన్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు ఆర్జీవీ. పవన్‌ హీరోగా పాపం పసివాడు చిత్రం తీయాలంటూ పంచ్‌లు పేల్చారు వర్మ. పవన్‌ టార్గెట్‌గా ఆర్జీవీ చేసిన ట్వీట్లూ, కామెంట్లూ… ఏపీలో పెను సంచలనమే సృష్టించాయ్‌. ఇప్పుడు వ్యూహం సినిమా అంతకుమించి కలకలం రేపబోతోంది. ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న వ్యూహం మూవీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. వైఎస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదం దగ్గర్నుంచి… కాంగ్రెస్‌లో జగన్‌కు ఎదురైన అవమానాలు, కేసులు, జైలు జీవితం ఇందులో ఉండటమే కారణం. మరి, ఆర్జీవీ ఏమైనా కొత్త రహస్యాలు బయటపెడతారా!. అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం కథలో ఎలాంటి సంచలనాలు రివీల్‌ చేయబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక తొలుత రెస్పాండ్ అయింది మాత్రం ఏపీ కాంగ్రెస్ నేతలు. ఆర్జీవీ రిలీజ్‌ చేసిన వ్యూహం టీజర్‌లో అప్పటి కాంగ్రెస్‌ హైకమాండ్, జగన్‌ను ఇబ్బంది పెట్టినట్లు టీజర్‌లో చూపించారు. అంతేకాదు..జగన్‌ లొంగకపోవడంతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు వర్మ టీజర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. సంచలన కోసం…ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపించే వర్మను సీరియస్‌గా హెచ్చరించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుదర్రాజు. సోనియాను కించపరిస్తే వర్మను బట్టలూడదీసి కొడతామన్నారు. గాంధీ, నెహ్రుల కుటుంబాన్ని విమర్శిస్తే ఖబడ్దార్‌ అంటూ విరుచుకుపడ్డారు. తాజాగా ప్రాజెక్టుల గురించి సినిమా సీన్స్ తీస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా వార్‌లోకి ఎంటరయ్యింది. ఆర్జీవీకి దమ్ముంటే తెలుగుదేశం హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు దేవినేని ఉమా. అంతేకాదు.. పట్టిసీమ దండగ అంటూ ప్రచారం చేసిన వైఎస్సార్‌సీపీ.. ఏ మొహం పెట్టుకుని దానివైపు చూస్తున్నారని కూడా దేవినేని ప్రశ్నించారు. ‘ఆర్జీవీ దుర్మార్గుడని.. అతడికి బుద్ధి జ్ఞానం, లేదు..’ అని తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ప్రజంట్ వర్మ, దేవినేని ఉమ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది. వారి పోస్ట్‌లకు ఓ రేంజ్‌లో రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. మొత్తం వచ్చే ఎన్నికల సమయంలో వర్మ వ్యూహం సినిమా ప్రకంపనలు రేపే అవకాశం కనిపిస్తుంది. అయితే సినిమా నిజంగానే రాజకీయాలను ప్రభావితం చేస్తుందా..? వైసీపీకి ఓట్లను రాల్చే సాధనం అవుతుందా..? టీడీపీపై వ్యతిరేకత రగిలిస్తుందా అన్న అంశాలపై అయితే కంటిన్యూగా చర్చ జరుగుతూనే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే..
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే..
టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
కారు నెంబర్ ప్లేట్ చూసి బిత్తరపోయిన పోలీసులు.. తనిఖీ చేయగా..
కారు నెంబర్ ప్లేట్ చూసి బిత్తరపోయిన పోలీసులు.. తనిఖీ చేయగా..
ఈ కేడి కపుల్ మాములోళ్లు కాదు.. పైకి సుద్దపూసలే.. కానీ అసలు..
ఈ కేడి కపుల్ మాములోళ్లు కాదు.. పైకి సుద్దపూసలే.. కానీ అసలు..
చపాతీ పీట, కర్ర విషయంలో ఈ వాస్తు నియమాలు తప్పనిసరి..
చపాతీ పీట, కర్ర విషయంలో ఈ వాస్తు నియమాలు తప్పనిసరి..
అయ్యప్ప స్వాములు వెళ్తోన్న బస్సుకి ప్రమాదం.. డ్రైవర్ మృతి
అయ్యప్ప స్వాములు వెళ్తోన్న బస్సుకి ప్రమాదం.. డ్రైవర్ మృతి
సుందర్ వికెట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై హీట్
సుందర్ వికెట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయాలపై హీట్
డెడ్‌ బాడీకి ప్రాణం పోసిన స్పీడ్‌ బ్రేకర్‌.. ఆ తర్వాత జరిగిందిదే
డెడ్‌ బాడీకి ప్రాణం పోసిన స్పీడ్‌ బ్రేకర్‌.. ఆ తర్వాత జరిగిందిదే
సంక్రాంతికి సొంతూరు వెళ్లడం అంత ఈజీ కాదు బాసూ.! ఇది చదివేయండి..
సంక్రాంతికి సొంతూరు వెళ్లడం అంత ఈజీ కాదు బాసూ.! ఇది చదివేయండి..
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..