Bus Accident: ఆర్ధరాత్రి గుడి గోడెక్కిన బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని గుడి వద్ద లోయలోకిజగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు దాదాపు 33మంది ఉన్నట్లు సమాచారం. తప్పిన ప్రాణాపాయం.. గాయపడిన వారి సంఖ్య..

కడప, జూన్ 19: కడపలోని గువ్వలచెరువు ఘాట్‌లో త్రుటిలో బస్సు ప్రమాదం తప్పింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని గుడి వద్ద లోయలోకిజగన్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒరిగింది. మంగళవారం (జూన్ 18) అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు దాదాపు 33మంది ఉన్నట్లు సమాచారం. తప్పిన ప్రాణాపాయం.. గాయపడిన వారి సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. పోలీసులు, 108 సిబ్బంది, స్దానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అసలేం జరిందంటే..
జగన్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు ఘాట్లో మూడవ టర్నింగ్ వద్ద గల ఆంజనేయ స్వామి గుడి వద్దకు వచ్చేసరికి బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో ముందువైపు పోతున్న కారును వేగంగా గుద్దింది. డ్రైవరు చాకచక్యంగా బస్సును టెంపుల్ గోడ వైపుకు మళ్ళించగా ఆంజనేయస్వామి, వినాయక స్వామి గుడి మధ్యలో గల సందులోకి పోయింది. దీంతో బస్సు గుడి గోడపై బోల్తా పడి.. అక్కడే నిలిచిపోయింది. బస్సు, కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు డ్రైవర్‌తోపాటు పలువురి స్వల్ప గాయాలైనాయి. ఎలాంటి ప్రాణ నష్టము జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం ధాటికి బస్సు ఢీ కొట్టిన కారు వెనుక భాగం పూర్తిగా పాడైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








