Andhra Pradesh: అర్థరాత్రి ఒంటి గంటకు వాట్సాప్‌లో స్టేటస్.. తెల్లారే సరికల్లా అంతా షాక్!

విశాఖపట్నంలోని ఎండాడ రోడ్‌లో సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. రోడ్డు పక్కనే ఖాళీ ప్రదేశంలో.. డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Andhra Pradesh: అర్థరాత్రి ఒంటి గంటకు వాట్సాప్‌లో స్టేటస్.. తెల్లారే సరికల్లా అంతా షాక్!
Burnt Dead Body
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: Mar 10, 2024 | 1:03 PM

విశాఖపట్నంలోని ఎండాడ రోడ్‌లో సగం కాలిన మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది. రోడ్డు పక్కనే ఖాళీ ప్రదేశంలో.. డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడు ఆరిలోవకు చెందిన కారు డ్రైవర్ సుబ్రమణ్యంగా గుర్తించారు పోలీసులు. ప్రాథమిక ఆధారాలను బట్టి.. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు సుబ్రమణ్యం. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

ఆధార్ కార్డు ఆధారంగా మృతుడి బంధువులను పిలిపించి విచారించారు పోలీసులు. మొబైల్ ఫోన్ వెరిఫై చేసిన పోలీసులకు, గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టుగా ఆధారాలు లభించాయి. దీంతోపాటు మనశ్శాంతి, దేవుని సన్నిధి అంటూ వాట్సాప్ స్టేటస్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. గత అర్ధరాత్రి ఒంటి గంటకు వాట్సప్ స్టేటస్ లు ఉన్నాయని చెబుతున్నారు ఏసీపీ రాంబాబు. ఘటన జరగక ముందు ఈ స్టేటస్ లో పెట్టుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అంటున్న పోలీసులు.. అతనికి మనస్థాపానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం లభించిన ప్రాథమిక ఆధారాలు ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా కేసు దర్యాప్తులోనే ఉందన్నారు ఏసీపీ రాంబాబు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…