వేధిస్తున్నాడని అన్ననే చంపేశాడు.. కత్తితో పొడిచి దారుణం.. చివరికి

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సొంత వాళ్లు, రక్తం పంచుకున్న వాళ్లు అన్న భేదం లేకుండా దారుణంగా ప్రవర్తిసున్నారు. విచక్షణ కోల్పోయి రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు...

వేధిస్తున్నాడని అన్ననే చంపేశాడు.. కత్తితో పొడిచి దారుణం.. చివరికి
crime news
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 05, 2022 | 3:52 PM

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సొంత వాళ్లు, రక్తం పంచుకున్న వాళ్లు అన్న భేదం లేకుండా దారుణంగా ప్రవర్తిసున్నారు. విచక్షణ కోల్పోయి రాక్షసులుగా వ్యవహరిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు. ఫలితంగా దాడులు(Assault), హత్యలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులను వేధిస్తున్నాడన్న కారణంతో సొంత అన్నను తమ్ముడు దారుణంగా హత్య(Murder) చేశారు. కూరగాయలు కోసే కత్తితో దారుణంగా పొడిచి అంతమొందించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్య చేసిన తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ(Vijayawada) అయోధ్యనగర్‌ లోని మారుతి టవర్స్‌లో వరప్రసాద్‌, ఉమామహేశ్వరి దంపతులు తమ కుమారులతో కలిసి నివాసముంటున్నారు. మొదటి కుమారుడు హర్షత్‌.. ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. చిన్న కుమారుడు పార్ధివ్‌ దూర విద్యా విధానంలో డిగ్రీ అభ్యసిస్తున్నాడు.

హర్షత్‌ రోజూ తల్లిదండ్రులతో గొడవ పడడం, వారిని కొట్టడం వంటివి చేసేవాడు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న సోదరుడిని ఎలాగైనా అంతమొందించాలని పార్ధివ్ ఏడాది క్రితం నిర్ణయించుకున్నాడు. అన్న హర్షత్ మారతాడని ఆశించాడు. అయినా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పార్ధివ్ తీవ్ర ఆగ్రహంతో సోఫాలో నిద్రిస్తున్న హర్షత్ పై కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. పొట్టలోనూ, ఛాతి భాగంలో పొడిచాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే హర్షత్‌ చనిపోయాడు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు.

అజిత్ సింగ్‌ నగర్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఘర్షణ కాదని హత్య జరిగిన విషయాన్ని నిర్ధారించుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో ప్రాథమికంగా లభించిన ఆధారాలను సేకరించారు. తల్లిదండ్రులను వేధిస్తుండడం చూసి తట్టుకోలేక పార్ధివ్‌ తన అన్న హర్షత్‌ను హతమార్చినట్లుగా నిర్ధరించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.

Also Read

NHM Gadwal Recruitment: జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో మెడికల్ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగుస్తున్న గడువు!

KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!

Telangana IPS: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు.. ట్రాఫిక్‌ డీసీపీ ఆకస్మిక బదిలీ