KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!

కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన విద్యార్ధులకు పీఎమ్‌ కేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ (PM Cares for Children Scheme) కింద ఏ తరగతిలోనైనా ఉచితంగా సీటు ఇవ్వనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్‌..

KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!
Kvs Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2022 | 3:15 PM

KVs to offer free admission for these children: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన విద్యార్ధులకు పీఎమ్‌ కేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ (PM Cares for Children Scheme) కింద ఏ తరగతిలోనైనా ఉచితంగా సీటు ఇవ్వనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ (free education in KVS) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1200 కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఏ తరగతిలోనైనా ఫ్రీగానే విద్య నందించడానికి ముందుకొచ్చింది. అంతేకాకుండా ఈ పథకం కింద ఇప్పటికే 4000 మంది విద్యార్థులకు చెందిన జాబితాను విద్యా మంత్రిత్వ శాఖ తయారు చేసి, ప్రాంతీయ అధికారులు, కేవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపింది కూడా. కాగా కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 1వ తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభించింది. ఇక 2 నుంచి 10వ తరగతికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్ 8న ప్రారంభం అవుతాయి.10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు ప్రకటించిన పది రోజుల్లో 11వ తరగతి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.

కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలను వారి వయస్సు ప్రకారం ఆయా క్లాసుల్లో చేర్చుకుంటామని తెల్పింది. అందుకనుగుణంగా అన్ని రకాల ఫీజుల నుంచి మినహాయించి, ఉచితంగా ప్రవేశాలు కల్పించడమేకాకుండా, ఫ్రీగా విద్యను అందించనున్నట్లు తాజా నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేసింది. విద్యాలయ వికాస్ నిధి కేటగిరీ కింద, ఆయా జిల్లాల్లోని మెజిస్ట్రేట్‌ సిఫార్సుల మేరకు ఈ విధమైన విద్యార్ధులకు ప్రవేశం కల్పించనున్నట్లు తెల్పింది. గరిష్టంగా 10 మంది విద్యార్థులు.. అంటే ఒక్కో తరగతికి ఇద్దరేసి చొప్పున, డీఎమ్‌లు ఎంపిక చేసి అడ్మిషన్‌ ఇవ్వొచ్చు. ఈ టెహ్రాన్, మాస్కో, ఖాట్మండులోని అంతర్జాతీయ శాఖలతో సహా దేశంలోని మొత్తం 1200 పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.inను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా సూచించింది.

Also Read:

UGC National Fellowship 2022: వికలాంగ అభ్యర్ధులకు యూజీసీ నేషనల్ ఫెలోషిప్‌.. చివరి తేదీ ఇదే!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..