AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Corona: పెళ్లికి క‌రోనా ట‌చ్.. పీట‌ల మీద పెటాకులు… అసలు విష‌యం ఏంటంటే..?

కాసేపట్లో పెళ్లిపీటలపై ఒక్కటి కావాల్సిన జంటను కరోనా మహమ్మారి విడగొట్టింది. మూడు ముళ్లు, ఏడడుగులు వేయాల్సిన సమయంలో ఎక్కడి వారక్కడ పరుగులు పెట్టారు.

Bride Corona: పెళ్లికి క‌రోనా ట‌చ్.. పీట‌ల మీద పెటాకులు... అసలు విష‌యం ఏంటంటే..?
Bride Corona
Ram Naramaneni
|

Updated on: May 08, 2021 | 7:34 AM

Share

కాసేపట్లో పెళ్లిపీటలపై ఒక్కటి కావాల్సిన జంటను కరోనా మహమ్మారి విడగొట్టింది. మూడు ముళ్లు, ఏడడుగులు వేయాల్సిన సమయంలో ఎక్కడి వారక్కడ పరుగులు పెట్టారు. బంధువులు, స్నేహితుల మధ్య జరగాల్సిన పెళ్లి పెటాకులైంది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిందీ సంఘటన. కరోనా పాజిటివ్ పేరుతో పెళ్లి పీటల మీదే ఓ పెళ్లి జంట విడిపోయింది. జిల్లాలోని ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దమనుసుల సమక్షంలో ముహూర్తం నిర్ణయించారు. ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం వివాహ వేదిక కదిరికి చేరుకున్నారు. బందువులంతా కలిసి సంప్రదాయం ప్రకారం పెళ్లి కార్యక్రమాలకు సిద్ధం చేశారు. ఇంతలోనే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ మొండికేసింది పెళ్లికూతురు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఇప్పుడు పెళ్లి వద్దని తేల్చి చెప్పింది. పెళ్లికూతురు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పంచాయితీ కాస్త పొలిస్ స్టేషన్ మెట్లెకింది.

తమ బిడ్డను, తమను భయపెట్టి పెళ్లి చేయాలని చూస్తున్నారని, లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పెళ్లికూతురు తల్లి చెబుతోంది. మొదటి నుంచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కుమార్తె చెబుతోంది. కరోనా ఉందని చెబుతున్నా బలవంతంగా తాళి కడతామని చెబుతున్నారని అంటోంది. మరోవైపు ఇప్పటికే తమవద్ద నుంచి మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదు తీసుకున్నారని, డబ్బుల ఆశతోనే పెళ్లికి ఒప్పుకోలేదని పెళ్ళికొడుకు అంటున్నారు.

పెళ్లికూతురు, ఆమె తల్లి ఇష్ట ప్రకారమే అన్నింటికి ఒప్పుకుని డబ్బులు కూడా తీసుకున్నారని తీరా పెళ్లిపీటలకు వరకు వచ్చేసరికి అడ్డం తిరగారని సంబంధం కుదిర్చిన పెళ్లి పెద్ద చెబుతున్నారు. అయితే తమ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కదిరి టౌన్ ఎస్సై మహ్మద్ రఫీ చెప్పడంతో ఇరువురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి కరోనా కారణంగా పెళ్లి పెటాకులు కావడం స్థానికంగా సంచలనంగా మారింది.

Also Read:  బంగారం ప్రియులకు షాక్‌.. పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..