Andhra Pradesh: హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. దానిపై చర్చకు సిద్ధమంటూ టీడీపీ నేతలకు బోత్స సవాల్..
Andhra Pradesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పాలిటిక్స్ హీటెక్కుతున్నాయ్. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లపర్వం పీక్ స్టేజ్‌కు చేరుతోంది. తాజాగా.. మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మంత్రి బొత్స..
Andhra Pradesh: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పాలిటిక్స్ హీటెక్కుతున్నాయ్. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లపర్వం పీక్ స్టేజ్‌కు చేరుతోంది. తాజాగా.. మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, 2014 నుంచి 2019 వరకు ప్రజలకు టీడీపీ ఏం చేసిందో.. 2019 నుంచి వైసీపీ ఎన్ని హామీలు అమలు చేసిందో చెప్పేందుకు రెడీగా ఉన్నామన్నారు. టీడీపీ నేతలు.. 2014 ఎన్నికల మేనిఫెస్టో తీసుకుని చర్చకు రావాలన్నారు మంత్రి బొత్స.
ఇదిలా ఉండగా రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఇప్పటికే మొదటి విడతగా మేనిఫెస్టోని విడుదల చేసింది. ఈ క్రమంలోనే రెండో విడత ఎలెక్షన్స్ మేనిఫెస్టోని విడుదల చేసేందుకు కూడా కసరత్తు చేస్తోంది. టీడీపీ విడుదల చేసిన తొలి విడత మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులు, బీసీలు, ఇంటింటికీ మంచినీరు,పూర్ టు రిచ్ వంటి ఆరు అంశాలకు పెద్దపీట వేశారు. ఇదే తరహాలో రెండో విడత మేనిఫెస్టోలో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..