RRR Arrest : రఘురామరాజు అరెస్ట్ పై రాజకీయ ప్రకంపనలు.. కీలక వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి పురందేశ్వరి
Purandeswari on RRR arrest : వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది...
Purandeswari on RRR arrest : వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రఘురామరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను కొందరు నేతలు తప్పుబడుతున్నారు. బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ అంశంలో స్పందించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండిస్తున్నట్టు తెలిపారు. “రాష్ట్ర ప్రభుత్వ పరువుకు భంగం కలిగేలా ప్రసంగించాడన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు… ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది” అని పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్టకు చేరింది.
Read also : YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు