ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో పిటిషన్.. నిబంధనల ప్రకారం అరెస్టు చేయలేదన్న న్యాయవాదులు
Raghu Rama Krishna Raju: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ని..
Raghu Rama Krishna Raju: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలున్నాయని వారు కోర్టుకు తెలిపారు. మరో వైపు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారన్న అభియోగంపై ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ గుంటూరుకు చేరుకున్నారు. రఘురామ కృష్ణరాజును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఎంపీ రఘురామ కృష్ణరాజు పై ఐ పి సి 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏపీ సిఐడి అధికారులు.
ఇవీ చదవండి:
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతి.. ఊపిరి పీల్చుకున్న రోగుల బంధువులు