BJP: నిన్ననే చెప్పేశా.. ఇక నో కామెంట్‌.. కమలం నేతల మధ్య ఏం జరుగుతోంది.. ఇంత కలవరం ఎందుకో..

ఏపీలో వేగంగా మారుతోన్న రాజకీయ సమీకరణాలు కాషాయ పార్టీలో కల్లోలం రేపుతున్నాయ్‌. పవన్‌ అండ్‌ బాబు ఎపిసోడ్‌ తర్వాత బీజేపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే టైమ్‌లో సోమునూ... కన్నా టార్గెట్‌ మరింత అలజడి రేపింది. ఇంతకీ, ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?. ఎందుకంత కలవరానికి గురవుతోంది?

BJP: నిన్ననే చెప్పేశా.. ఇక నో కామెంట్‌.. కమలం నేతల మధ్య ఏం జరుగుతోంది.. ఇంత కలవరం ఎందుకో..
Kanna Lakshminarayana and Somu Veerraju
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2022 | 8:07 PM

విశాఖ హైఓల్టేజ్‌ ఎపిసోడ్.. కాషాయ పెద్దలపై జనసేనాని కామెంట్స్.. పవన్‌తో బాబు భేటీ.. వెంటవెంటనే జరిగిన వరుస పరిణామాలతో.. ఏపీ బీజేపీలో కలవరం రేగింది. అదే టైమ్‌లో ఆంధ్రా బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేయడం మరింత హీట్‌ పుట్టించింది. సోముపై డైరెక్ట్‌గా తన అసంతృప్తిని బయటపెట్టడంతో కన్నా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తారన్న ప్రచారం ఏపీ బీజేపీలో కల్లోలం సృష్టించింది. అయితే, కన్నా ఇష్యూపై డిఫరెంట్‌గా రియాక్టయ్యారు సోము వీర్రాజు. కన్నాకు హైకమాండ్‌తో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ ఉంది. అంతకంటే ఎక్కువ మాట్లాడా.. అంటూ స్కిప్‌ చేశారు సోము. సోముపై నిన్న నిప్పులు చెరిగిన కన్నా, ఇవాళ సైలెంటైపోయారు. తాను చెప్పాలనుకున్నది నిన్ననే చెప్పేశా, ఇక నో కామెంట్‌ అంటున్నారు కన్నా. హైకమాండ్‌ సూచన మేరకు ఇకపై తాను నోరు విప్పేదే లేదన్నారు. పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపైనా డైరెక్ట్‌గా ఆన్సర్‌ ఇవ్వలేదు కన్నా.

జనసేన-బీజేపీ పొత్తుపై అనుమానాలు చెలరేగుతున్నవేళ, ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ కోకన్వీనర్‌ సునీల్‌ దేవధర్‌. రెండు పార్టీల మధ్య స్నేహబంధం కొనసాగుందని తేల్చిచెప్పారు. రోడ్‌మ్యాప్‌పైనా ఎలాంటి గందరగోళం లేదన్నారు. అయితే, టీడీపీతో పొత్తు మాత్రం పొత్తు ఉండబోదన్నారు.

తెలుగుదేశం, వైసీపీ.. రెండూ దొంగ పార్టీలేనన్న దేవధర్‌, వైసీపీ నాగరాజు అయితే.. టీడీపీ సర్పారాజ్‌ అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. టోటల్‌గా, ఏపీలో వేగంగా మారుతోన్న రాజకీయ సమీకరణాలు, పరిణామాలు.. ఏపీ కాషాయదళంలో అలజడి రేపింది. మరి, ఇది ఇంతటితో ఆగుతుందా?.. లేక కంటిన్యూ అవుతుందా?.. వాట్‌ నెక్ట్స్‌ తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం