AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం శుభవార్త అందించింది. ఏపీలోని కూలీలకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.1805 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కూలీలకు సకాలంలో నిధులు చెల్లించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. అయితే ఈ పథకంలో కేంద్రం ఇటీవల మార్పులు చేసింది.

Andhra Pradesh: ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. నిధులు వచ్చేశాయ్..
Indian Money
Venkatrao Lella
|

Updated on: Apr 20, 2026 | 10:27 PM

Share

ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అందింది. కేంద్రం కూలీలకు చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. ఏపీలోని కూలీలకు ఇచ్చేందుకు రూ.1805 కోట్లు తాజాగా రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం కోసం వీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు అర్ధిక భరోసాను అందించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ, కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కూలీలకు సమయానికి వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ఎవరికి ఎంతంటే..?

కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఎస్సీలకు రూ.361 కోట్లు, ఎస్టీలకు రూ.253 కోట్లు, మిగతా సామాజికవర్గాల ప్రజలకు రూ.1190 కోట్లు కేటాయించారు. అయితే ఉపాధి హామీ పథకంలో కేంద్రం అనేక మార్పులు చేస్తోంది. ఇటీవలే పేరును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక కూలీలకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. అలాగే కూలీలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 18002001001 కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక కూలీలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుతారు. ఇక పనిమిుట్లు కూడా అందిస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే పని కల్పించాల్సి ఉంటుంది.

వేతనం పెంపు

ప్రస్తుతం వీబీ జీరామ్‌జీ పేరుతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. గతంలో ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు మార్చింది. ఇక రోజువారీ వేతనం గతంలో రూ.250గా ఉండగా.. ఇప్పుడు రూ.307కి పెంచారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. సొంత ఊర్లోనే దీని వల్ల ఉపాధి లభిస్తోంది.

Follow Us