AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Politics: పవన్ దారెటు..? ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు..

జనసేన ఆవిర్బావ సభలో పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పొత్తులు, రాజకీయ బంధాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో ఉన్న బంధం అవమానాల మధ్య సాఫీగా సాగడం లేదన్న జనసేన .. మరోసారి కొత్త స్నేహానికి సిద్ధమవుతోంది.

Andhra Politics: పవన్ దారెటు..? ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Mar 15, 2023 | 8:29 PM

Share

జనసేన ఆవిర్బావ సభలో పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పొత్తులు, రాజకీయ బంధాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో ఉన్న బంధం అవమానాల మధ్య సాఫీగా సాగడం లేదన్న జనసేన .. మరోసారి కొత్త స్నేహానికి సిద్ధమవుతోంది. ఇదంతా ముందే ఊహించామని వైసీపీ అంటే… టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని బహిరంగసభలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నిస్తోంది భారతీయ జనతా పార్టీ.

ఏపీలో పాత స్నేహాలకు బీటలు వారుతున్నాయా? కొత్త బంధాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయా? అనే విషయం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పేరుకే పొత్తు కానీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఎలాంటి సహకారం లేదంటూ బాంబ్‌ పేల్చిన పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తనను అవమానించారన్నారు. జాతీయ నాయకత్వం తనతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర నాయకత్వమే ముందుకు తీసుకెళ్లడం లేదన్న పవన్‌ వ్యాఖ్యలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీశాయి. అదే సమయంలో ఓటు వేస్ట్‌ కానివ్వనన్న పవన్‌.. సొంతంగా గెలుస్తామనుకుంటేనే ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పేశారు పవన్‌.

ఆవిర్బావ సభలో జెండా మాత్రమే జనసేనది అయితే.. అజెండా మొత్తం టీడీపీదే అంటున్నారు వైసీపీ నాయకులు. సింగిల్‌గా వచ్చే ధైర్యం లేక మొత్తం జనసేనను టీడీపీకి అమ్మకానికి పెట్టారంటోంది అధికారపార్టీ.

ఇవి కూడా చదవండి

ఏపిలో రెండు కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఎదగాలన్నది తమ పార్టీ విధానమని.. జనసేన వ్యూహం మార్చుకుంటే అప్పుడు చూస్తామంటోంది బీజేపీ. పొత్తులపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయసమీకరణాలు మారిపోతున్నాయి.. కొత్త స్నేహాలు తెరమీదకు వస్తాయా? ఇంతకీ ప్రత్యర్థుల పొత్తులపై అధికార వైసీపీ ఏమి కోరుకుంటోంది? జనసేన నిర్ణయాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..