AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బార్ లైసెన్సులకు బిడ్డింగ్.. జోన్-2, జోన్ – 3లకు దరఖాస్తులు.. స్పందన అంతంత మాత్రమే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బార్‌ లైసెన్సుల కోసం బిడ్డింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. జోన్‌-1, జోన్- 4 కు బిడ్డింగ్ పూర్తవగా.. ఇవాళ (ఆదివారం) జోన్‌-2, జోన్-3 కి బిడ్డింగ్ జరగనుంది. అయితే.. ఆశించినస్థాయిలో బిడ్డర్స్‌ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా...

Andhra Pradesh: బార్ లైసెన్సులకు బిడ్డింగ్.. జోన్-2, జోన్ - 3లకు దరఖాస్తులు.. స్పందన అంతంత మాత్రమే..
Bars
Ganesh Mudavath
|

Updated on: Jul 31, 2022 | 7:12 AM

Share

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బార్‌ లైసెన్సుల కోసం బిడ్డింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. జోన్‌-1, జోన్- 4 కు బిడ్డింగ్ పూర్తవగా.. ఇవాళ (ఆదివారం) జోన్‌-2, జోన్-3 కి బిడ్డింగ్ జరగనుంది. అయితే.. ఆశించినస్థాయిలో బిడ్డర్స్‌ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. బార్‌ లైసెన్సుల (Bar Licenses) కోసం అధికారులు బిడ్డింగ్‌ నిర్వహిస్తున్నారు. జోన్‌-1 అండ్ జోన్‌-4కు నిన్న (శనివారం) నిర్వహించిన బిడ్డింగ్ లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఇక, జోన్‌-2, జోన్‌-3కి జరిగే బిడ్డింగ్ లో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదారి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు కానుంది. న్యూ బార్‌ పాలసీ ప్రకారం మూడేళ్లపాటు ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వనుంది. అంటే 2025 వరకు లైసెన్సులు జారీ చేసే అవకాశం కల్పిస్తోంది.

కర్నూలు జిల్లాలో బార్‌ లైసెన్సుల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌కి ఆశించినంత స్పందన రాలేదు. జిల్లావ్యాప్తంగా 27 బార్లకు ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించగా కేవలం 36 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కర్నూలులోని 18బార్లకు 23మంది, ఆదోనిలోని 5 బార్లకు ఆరుగురు, ఎమ్మిగనూరులో 3 బార్లకు ఐదుగురు, గూడూరులో ఒక బార్‌కు ఇద్దరు మాత్రమే అప్లై చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో బిడ్డింగ్‌ను గమనిస్తే పోటీ ఏం స్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. వ్యాపారుల్లో ఆసక్తి తగ్గిందని చెప్పాలి. అంతేకాదు, రిజిస్ట్రేషన్స్‌తోనే వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆశిస్తే, ప్రభుత్వ ఖజానాకు 91కోట్లు మాత్రమే ఇన్‌కమ్‌ ఇచ్చింది. 1,672మంది అప్లై చేసుకుంటే, 1,158 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. అంటే 514మంది పోటీ నుంచి వైదొలిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..