Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై నేడు సెషన్స్ కోర్టులో విచారణ.. ఈసారైనా బెయిల్ వచ్చేనా..?
Bhuma Akila Priya: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది.
Bhuma Akila Priya: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై నేడు సెషన్స్ కోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిల ముందస్తు బెయిల్ పిటిషన్లపైనా సికింద్రాబాద్ కోర్టు విచారించనుంది.
ఈ కేసుకు సంబంధించి మొత్తం మూడు పిటీషన్లపై కోర్టు ఇవాళ విచారించనుంది. కాగా, మూడు బెయిల్ పిటీషన్లపై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కాగా, భూమా అఖిల ప్రియకు సంబంధించి బెయిల్ పిటీషన్లు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు మూడవసారి అయినా బెయిల్ దక్కేనా? లేదా?, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హఫీజ్‌పేట్‌లో భూముల వ్యవహారానికి సంబంధించిన ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను భూమా అఖిల ప్రియ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేయగా, ఆమె భర్త భార్గవ్ రావు, ఇతర కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.
Also read:
Osmania University PGRRCDE PG Exams : ఓయూ డిస్టెన్స్ పరీక్షల తేదీల్లో మార్పు…