AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: శరవేగంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ పనులు.. అందుబాటులోకి ఎప్పుడంటే?

ఉత్తరాంధ్ర అభివృద్ధి మణిహారంగా భావిస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 4,750 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్దఎత్తున ఆదాయం రానుంది

Andhra Pradesh: శరవేగంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ పనులు.. అందుబాటులోకి ఎప్పుడంటే?
Bhogapuram Green Field Airport
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Dec 19, 2023 | 8:35 PM

Share

ఉత్తరాంధ్ర అభివృద్ధి మణిహారంగా భావిస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 4,750 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తే వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్దఎత్తున ఆదాయం రానుంది. దీంతో అందరి దృష్టి విమానాశ్రయ నిర్మాణం పైనే పడింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ ఫోర్ట్ నిర్మాణానికి ఈ ఏడాది మే 3న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. కేవలం 36 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయనున్నట్లు నిర్మాణ సంస్థ అధినేత జిఎంఆర్ శంఖుస్థాపన సభావేదికపైనే ప్రకటించారు. అయితే 36 నెలలు కాదు 30 నెలల్లోనే పనులు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జి ఎమ్ ఆర్ ను కోరడంతో అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అలా జి ఎమ్ అర్ హామీ ఇచ్చినట్లే శంకుస్థాపన జరిగిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొదట ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఆలస్యమవుతుందని అంతా భావించారు. అయితే తాజాగా ఉత్తరాంధ్ర వైసిపి ప్రజాప్రతినిధులు మీడియాతో కలిసి భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించారు. అలా సందర్శించిన ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లోని ప్రగతిని చూసి ఆశ్చర్యపోయారు. భారీ అధునాతన యంత్రాలు, వందలాది మంది కార్మికులతో కలిసి రాత్రింబవళ్ళు పనులు జరుగుతున్నాయి. జరుగుతున్న నిర్మాణ పనులను చూస్తుంటే 2025 డిసెంబర్ నాటికి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తుంది

ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మొత్తం 2,203 ఎకరాల భూమిని జిఎంఆర్ సంస్థకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్థలంలో 3.8 కిలో మీటర్ల రన్ వే తో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకోసం సుమారు 4.750 కోట్లు వెచ్చించనుంది జి ఎమ్ ఆర్ సంస్థ. ఎయిర్ పోర్ట్ చుట్టూ సుమారు 23 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ప్రహరీగోడలో ఇప్పటికే దాదాపు 16 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి అయ్యింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో కొంతమేర పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టి కి అప్పగించింది జి ఎమ్ ఆర్. అంతేకాకుండా మరికొన్ని పనులు జిఎమ్ ఆర్ సంస్థ నేరుగా నిర్మాణాలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విమానాశ్రయాల నిర్మాణాల్లో పేరుపొందిన జిఎమ్ఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లిఖార్జనరావు తన సొంత జిల్లా విజయనగరం జిల్లా కావడం, ఆ జిల్లాలోనే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంను తానే చేపట్టడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగవంతంగా పనులు జరుపుతున్నారు. మరోవైపు ఈ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనుల్లో జరుగుతున్న ప్రగతి పై సమీక్షిస్తూ దూకుడు పెంచుతున్నారు. ఏదైనా మరో 24 నెలల్లో అత్యంత ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలు ప్రారంభం అవ్వనున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…