AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bapatla: అవివాహితులైన అన్నదమ్ముల ఇంటి నుంచి దుర్గంధం.. పోలీసులు వెళ్లి చూడగా

బాపట్లలో శిఖరం వారి వీధిలో నివసిస్తున్న అన్నదమ్ములు బొడ్డుపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రి, డాక్టర్ బాలసుబ్రమణ్యం అనారోగ్యం, ఒంటరితనం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పురుగుమందు కలిపిన ఆహారం తీసుకోవడంతో.. వీరితో పాటు వారి కుక్కలు కూడా మృతి చెందాయి. ఈ ఘటన స్థానికంగా విషాదకర చర్చనీయాంశంగా మారింది.

Bapatla: అవివాహితులైన అన్నదమ్ముల ఇంటి నుంచి దుర్గంధం.. పోలీసులు వెళ్లి చూడగా
Brothers
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 13, 2025 | 12:15 PM

Share

అది బాపట్లలోని శిఖరం వారి వీధి. ఎంతో కాలంగా అక్కడ ఇద్దరు అవివాహితులైన అన్నదమ్ములు నివసిస్తున్నారు. ఒకరు పంటి వైద్యుడు కాగా… ఇద్దరికి అరవై ఏళ్ల పైనే వయస్సు ఉంటుంది. అయితే వీరి నివసిస్తున్న ఇంటి నుంచి దుర్గధం వస్తుండటంతో స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు.  రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి లోపలకి వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. అన్నదమ్ములిద్దరూ చనిపోయి ఉన్నారు. వీరితో పాటు ఉండే రెండు కుక్కలు కూడా చచ్చి పడి ఉన్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శిఖరం వారి వీధిలో అన్నదమ్ములు బొడ్డుపల్లి వెంకట సుబ్బయ్య శాస్త్రి, డాక్టర్ బాలసుబ్రమణ్యం నివసిస్తున్నారు. వీరికి వివాహం కాలేదు. ఇద్దరికి వయస్సు అరవై ఏళ్లే పైనే ఉంటుంది. దీంతో తరుచు అనారోగ్యం బారిన పడుతున్నారు. వీరి బంధువులు గుంటూరులో నివాసం ఉంటున్నారు. సుబ్రమణ్యం పంటి వైద్యులుగా సేవలందిస్తున్నారు. అయితే అనారోగ్యం, వృద్ధాప్యం, ఒంటరితనం వేధిస్తుండటంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. వారు తినే ఆహారంలో పురుగు మందు కలుపుకొని ఉంటారన్న అనుకుంటున్నారు. వీరితో పాటు అదే ఆహారాన్ని తిన్న కుక్కలు కూడా చనిపోయాయి. దీంతో ఆత్మహత్యే అయి ఉంటుందని అనుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకొని ఉంటారని.. వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?