Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా..

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను కొండ కిందనే ప్రయివేట్ వాహనదారులు నిలువు దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ దోపీడీని అరికట్టేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మ రధం పేరిట తిరిగే ఆర్టీసీ బస్సుల్లో భక్తులకు తిరుమలలో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతానికి ఆర్టీసి ట్రయిల్ రన్ కింద కొన్ని బస్సులను తిప్పుతోంది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా..
Tirupati Free Rtc Bus Service For Pilgrims
Surya Kala
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 14, 2025 | 11:12 AM

Share

కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం సాక్షాత్తు వైకుంఠ వాసం అని భక్తుల నమ్మకం. అందుకనే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవాలని కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తారు. అయితే శ్రీవారి భక్తులను ప్రైవేట్ వాహనాల ఛార్జీల దోపిడీని అరికట్టడానికి, తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

తిరుమలలో భక్తులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వీలుని కల్పించనున్నామని చెప్పారు. గత కొంత కాలంగా భక్తుల నుంచి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చర్యల వలన రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ రవాణా నిర్వాహకులు అధిక ఛార్జీలను అరికట్టవచ్చునని భావిస్తున్నామని చెప్పారు.

150 ట్రిప్పులు అందుబాటులోకి

తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు.. ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని తెలిపారు. తిరుమల కొండపై APSRTC ద్వారా రోజూ ఫ్రీగా 150 ట్రిప్పులు తిప్పాలని ప్రతిపాదన పంపినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి అనుమతులు వస్తాయన్నారు. టిటిడి ఇప్పటికే ఉచిత సేవలను అందించే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది.  ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను చేర్చడం వల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..