Vastu Tips: ప్రేమ, డబ్బు, విజయం మీ సొంతం కావాలా.. గులాబీ పువ్వులతో ఈ వాస్తు చిట్కాలను ట్రై చేయండి..
గులాబీ పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమకు చిహ్నంగా గులాబీ పువ్వులను భావిస్తారు. అంతేకాదు మనిషి జీవితమలో ప్రేమ, సంపద, కెరీర్‌లో విజయాన్ని తెచ్చిపెట్టేందుకు వాస్తు శాస్త్రంలో గులాబీ పువ్వులకు సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తు చిట్కాలున్నాయి. ఈ రోజు గులాబీ పువ్వ ప్రత్యేకత ఏమిటి? జీవితంలో ప్రేమ మాధుర్యాన్ని తీసుకొచ్చేందుకు ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం..

Vastu Tips For Rose
గులాబీ పువ్వు అందంగా కనిపించడమే కాదు, సువాసనలను కలిగి ఉంటుంది. అనేక అంతర్గత ప్రయోజనాలను అందిస్తుంది. గులాబీ పువ్వుతో మీరు మీ ప్రేమికురాలీని , జీవిత భాగస్వామిని సంతోషపెట్టవచ్చు, అంతేకాదు ప్రేమ, విజయం, సంపదను ఇచ్చే పువ్వు గులాబీ పువ్వు ఇది. మంచి, సంతోషకరమైన జీవితానికి చాలా ముఖ్యమైన గులాబీ పువ్వుకి సంబంధించిన వాస్తు నివారణలను ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం.
గులాబీ పువ్వు..వాస్తు శాస్త్రం
గులాబీ పువ్వు కేవలం అందం, ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు. వాస్తు శాస్త్రంలో దీనిని శక్తి, ఆకర్షణ, విజయానికి మూలంగా పరిగణిస్తారు. జీవితంలో ప్రేమ, సంపద, పురోగతిని తీసుకువచ్చే శక్తిని కలిగి ఉన్న గులాబీకి సంబంధించిన ప్రత్యేక వాస్తు నివారణలు ఏమిటంటే..
గులాబీ పువ్వు ప్రత్యేకత ఏమిటంటే
- గులాబీల సువాసన ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది .
- ఎర్ర గులాబీ ప్రేమ, ఆకర్షణను పెంచుతుంది.
- పసుపు గులాబీలు సంబంధాలను, వృత్తిపరమైన నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తాయి.
- తెల్ల గులాబీ శాంతి, సమతుల్యత, ఆధ్యాత్మిక శక్తిని తెస్తుంది.
ఇవి కూడా చదవండి
గులాబీకి వాస్తు నివారణ ..ఒక పువ్వు, అనేక ప్రయోజనాలు
- ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని తీసుకురావడానికి మార్గాలు: బెడ్ రూమ్ లోని నైరుతి మూలలో 2 ఎర్ర గులాబీలు ఉన్న ప్లవర్ వెజ్ ని ఉంచండి. ప్రతిరోజూ పువ్వులను మార్చి సువాసనగల వాతావరణాన్ని నిర్వహించండి. ఈ పరిహారం వివాహ జీవితంలో ప్రేమ, ఆకర్షణ, అవగాహనను పెంచుతుంది.
- సంపద, శ్రేయస్సు కోసం నివారణలు: ఇంట్లో ఉత్తర దిశలో రాగి గిన్నెలో పసుపు గులాబీ రేకులను ఉంచండి. కొంచెం పసుపు, ఒక నాణెం పెట్టండి. ఇలా చేయడం వలన డబ్బు రాకతో పాటు, ఆర్థిక స్థిరత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- కెరీర్ , విజయం కోసం: రోజ్ వాటర్ లో నానబెట్టిన తెల్ల గులాబీని స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్ మీద ఉంచండి. దాని దగ్గర ఒక చిన్న ఇత్తడి గంట లేదా క్రిస్టల్ బంతిని ఉంచండి. ఈ పరిహారం మానసిక ఏకాగ్రతను, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
- ప్రతికూల శక్తిని తొలగించడానికి: వారానికి ఒకసారి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గులాబీ రేకులు, కర్పూరం వెలిగించి ధూపం వేయండి. ఈ పరిహారం చెడు దృష్టి, అసమ్మతి, దురదృష్టాన్ని దూరం చేస్తుంది.
- సూర్యోదయానికి ముందు ఎర్ర గులాబీ పువ్వుపై పసుపు, కుంకుమను వేసి.. పూజలో సమర్పించండి. ల క్ష్మీదేవిని, విష్ణువును ప్రార్థించండి. దీనితో ప్రేమ, శాంతి, శ్రేయస్సు అనే మూడు రంగాలలో సానుకూల మార్పులను చూస్తారు.
గులాబీ వాస్తు నివారణలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
- వాడిపోయిన లేదా ఎండిన పువ్వులను ఎప్పుడూ ఉంచవద్దు.
- ప్రతి 1-2 రోజులకు ఒకసారి పువ్వులను మార్చండి.
- పరిహారం చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్సు , ఏకాగ్రతను కలిగి ఉండండి.
- వాస్తు ప్రకారం సరైన దిశను ఎంచుకోండి.